Share News

Viral Video: ప్రాణం తీసిన పార్కింగ్ గొడవ..ఏం జరిగిందంటే..

ABN , Publish Date - Mar 13 , 2025 | 01:07 PM

ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఓ చిన్న బైక్ పార్కింగ్ గొడవ, క్రమంగా దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి కిందపడి మరణించాడు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Viral Video: ప్రాణం తీసిన పార్కింగ్ గొడవ..ఏం జరిగిందంటే..
Mohali parking dispute

ఓ యువ శాస్త్రవేత్తకు తన బైక్ పార్కింగ్ విషయంలో మరో వ్యక్తితో వివాదం మొదలైంది. అది కాస్తా క్రమంగా దుర్భాషలాడుకునే వరకు వెళ్లింది. ఆ తర్వాత గొడవ మరింత తీవ్రం కావడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఆ క్రమంలోనే ఓ వ్యక్తి మరణించాడు. పంజాబ్ మొహాలీలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటనలో, అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


రాత్రి సమయంలో..

ఇది వరకు విదేశాల్లో ఉన్న యువ శాస్త్రవేత్త డాక్టర్ అభిషేక్(39) ఇటివల భారత్ తిరిగి వచ్చి, మొహాలిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (IISER)లో చేరాడు. ఆ క్రమంలోనే ఓరోజు శాస్త్రవేత్త తన బైక్ పార్కింగ్ విషయంలో సెక్టార్ 66లో మంగళవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో తన ఇంటి పొరుగువాడైన మాంటీతో గొడవ పడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య వాదన పెరగడంతో, మాంటీ అభిషేక్‌పై తీవ్రంగా దాడి చేశాడు.


ఆస్పత్రికి తరలింపు..

ఆ క్రమంలో ఆతని కుటుంబ సభ్యులు గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ మాంటీ మాత్రం ఆపలేదు. దాడిలో భాగంగా మాంటీ అభిషేక్ కడుపు, ఛాతీపై బలంగా కొట్టాడు. దీంతో అతను నేలపై పడిపోయాడు. వెంటనే అతన్ని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ వైద్యులు పరీక్ష చేసిన తర్వాత అతను చనిపోయినట్లు ప్రకటించారు.


దీనికి మందు సర్జరీ

మరణించిన శాస్త్రవేత్తను జార్ఖండ్‌కు చెందిన 39 ఏళ్ల అభిషేక్ స్వర్ంకర్‌గా గుర్తించారు. ఆ శాస్త్రవేత్తకు ఇటీవల కిడ్నీ సర్జరీ జరిగిందని, అతని సోదరి కిడ్నీ ఇచ్చిందని తన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు డయాలసిస్ జరుగుతోందని, ఆ క్రమంలోనే కడుపులో గుద్దడం వల్ల అతను మరణించాడన్నారు. దీంతో ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు మాంటీని అరెస్ట్ చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సీసీ టీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి:

Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు


Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..

Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 13 , 2025 | 01:10 PM