Share News

Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..

ABN , Publish Date - Mar 13 , 2025 | 07:52 AM

హోలీ పండుగ కారణంగా ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. అవును మీరు చదివింది నిజమే. దీంతో మార్చి 13, 14, 15, 16 తేదీలలో వివిధ ప్రాంతాలలో బ్యాంకులకు హాలిడే.

Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..
HoliHolidays

దేశంలో ఈరోజు, రేపు (మార్చి 14న) హోలీ పండుగ సందర్భంగా పలు చోట్ల బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈరోజు ఏ ప్రాంతాల్లో హాలుడే ఉంది. ఎక్కడ పనిచేస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉండగా, మరికొన్ని చోట్ల మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి.

మార్చి 13: హోలిక దహన్

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇచ్చిన సెలవుల షెడ్యూల్ ప్రకారం మార్చి 13న గురువారం హోలిక దహన్ పండుగ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బ్యాంకులకు హేలిడే ఉంది. ఈ పండుగ కారణంగా ప్రధానంగా డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురం ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.


మార్చి 14: హోలీ పండుగ

మార్చి 14న శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా అనేక రాష్ట్రాలలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, జార్ఖండ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జమ్మూ, మహారాష్ట్ర, మేఘాలయ, న్యూఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, శ్రీనగర్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. కానీ ఇదే సమయంలో చెన్నై, అగర్తలా,బెంగళూరు, భువనేశ్వర్, ఇంపాల్, కొచ్చి, కోహిమా, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో మాత్రం నో హాలుడే.


మార్చి 15, 16 యావోషాంగ్ పండుగ

మార్చి 15న ముఖ్యంగా మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ అయిన యావోషాంగ్ కారణంగా ఈ ప్రాంతాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ పండుగ హిందూ, మైటేయి సంప్రదాయాలతో కలిపి జరుపుకుంటారు. దీంతో అగర్తలా, భువనేశ్వర్, ఇంపాల్, పానాజీ, రాంచీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. ఇక మార్చి 16 ఆదివారం అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారాంతపు సెలవు.


సురక్షితంగా బ్యాంకింగ్ సేవలు

ఈ సెలవుల నేపథ్యంలో బ్యాంకులు భౌతికంగా బంద్ ఉన్నా కూడా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి తదితర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఈ క్రమంలో వినియోగదారులు తమ ఆన్‌లైన్ సేవలను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు కస్టమర్లు ATMలలో నగదు డిపాజిట్, స్వీకరణ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు.


ఇవి కూడా చదవండి:

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 13 , 2025 | 07:54 AM