Share News

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 06:42 AM

దేశంలో హోలీ పండుగకు ముందే పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. నిన్నటితో పోల్చితే ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. అయితే ఏ మేరకు పెరిగాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Gold Silver Rate Today march 13th 2025

ఈరోజు బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని భావిస్తున్నారా. అయితే ఓసారి ఈ రేట్లను తెలుసుకుని వెళ్లండి. ఎందుకంటే నేడు (మార్చి 13న) ఉదయం నాటికి ఈ రేట్లు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో గుడ్ రిటర్న్స్ వెబ్‎సైట్ ప్రకారం ఈరోజు హైదరాబాద్, విజయవాడలో 24K బంగారం ధర 10 గ్రాములకు రూ.87,980కు చేరుకుంది. ఇది నిన్నటితో పోల్చితే రూ. 630 పెరగడం విశేషం. ఇక 22K బంగారం ధర 10 గ్రాములకు రూ. 80,650గా ఉంది. ఇదే సమయంలో ఢిల్లీలో 24K గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 88,140కు చేరుకోగా, 22K పసిడి రేటు 10 గ్రాములకు రూ. 80,810 స్థాయికి చేరుకుంది.


వెండి ధరల పెరుగుదల

మరోవైపు దేశీయ మార్కెట్లో వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు ఢిల్లీలో కిలోకు రూ.1,00,100 స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో పూణే, లక్నో, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో కూడా ఇదే ధరలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‎, విజయవాడలో వెండి ధరలు ఏకంగా రూ. 2200 పెరిగి రూ. 109,100 స్థాయికి చేరాయి. ఈ వెండి ధర నిన్న రూ. 106,900గా ఉంది.


రేట్ల పెరుగుదలకు కారణమిదే..

దేశంలోని CPI (కస్టమర్ ప్రైస్ ఇండెక్స్) ద్రవ్యోల్బణ డేటా ఊహించిన దానికంటే తక్కువగా నమోదవడంతో బంగారం ధరలు అధికమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అమెరికాలో ద్రవ్యోల్బణం కూడా నెమ్మదిగా తగ్గడం కారణమని అంటున్నారు. దీంతోపాటు భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI), అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) నుంచి రేట్ల కోతలపై ఆశలు పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు, భౌగోళిక, రాజకీయ అనిశ్చితి వంటివి కూడా బంగారం ధరల పెరుగుదలను ప్రేరేపించాయి.


MCX బంగారం, వెండి ధరలు

MCX (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్) ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరల్లో మార్పు వచ్చింది. మార్చి 12, 2025 నాటికి, 10 గ్రాముల MCX బంగారం ఫ్యూచర్స్ రూ. 46 తగ్గి, రూ.86,640 వద్ద ముగిశాయి. 2025 ఏప్రిల్ గడువు ముగిసిన బంగారం ఫ్యూచర్స్ మార్కెట్ లో కూడా నిరంతరం పెరుగుతున్న విధానం కనిపించింది. మే 2025 గడువు ముగిసిన MCX వెండి ఫ్యూచర్స్ ధర రూ. 126 తగ్గి, కిలో వెండి ధర రూ.99,350 వద్ద ముగిసింది ఇది కూడా వెండి మార్కెట్లో మరో కీలక పరిణామాన్ని సూచిస్తుంది.


ఇవి కూడా చదవండి:

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 13 , 2025 | 07:02 AM