Share News

Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు

ABN , Publish Date - Mar 13 , 2025 | 10:51 AM

ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికోడుతున్నాయి. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మత్రం భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఈ వానలు ఎక్కడ ఉన్నాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ  ప్రాంతాల్లో వర్షాలు
IMD rain Alert

దేశంలో వేసవి కాలం మొదలైనా కూడా పలు ప్రాంతాల్లో మాత్రం వర్షాలు (rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో మార్చి 15 వరకు జమ్మూ కశ్మీర్, బీహార్, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ వర్షాలు, రెండు వేర్వేరు తుఫానుల ప్రభావంతో వస్తున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది.


ఏ రాష్ట్రాల్లో వర్షపాతం

ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ నుంచి బీహార్ వరకు, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. ఈ వర్షాల కారణంగా రెండు ప్రధాన తుఫానులు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించింది. వీటి ప్రభావం దేశంలోని ఉత్తర, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో కూడా ఉంటుందని సూచనలు జారీ చేసింది.


తుఫానుల ప్రభావం

అయితే ఈ తుఫాను మొదట ఇరాక్ ప్రాంతంలో ఉద్భవించి, ఉత్తర భారతదేశంలోని జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ ప్రాంతాలను ప్రభావితం చేస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను వర్షపాతం, ఉరుములతో కూడిన భారీ వర్షాలతో వస్తుందని, దీంతో ఢిల్లీ-NCR ప్రాంతవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ వెల్లడించింది.


మరో తుఫాను

రెండో తుఫాను బంగ్లాదేశ్ సమీప ప్రాంతంలో ఉద్భవించి, భారతదేశం వైపు కదులుతుందని వెదర్ రిపోర్ట్ చెప్పింది. ఇది ప్రధానంగా తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు వర్షపాతాన్ని తెస్తుందన్నారు. ఈ తుఫాను కూడా ఐదు రోజుల పాటు (మార్చి 13 నుంచి 15 వరకు) భారీ వర్షాలకు కారణమవుతుందని IMD వెల్లడించింది. ఈ క్రమంలో ఉరుములతో కూడిన వర్షాలను ఆశించవచ్చని తెలిపింది.


దక్షిణ భారతదేశంలో..

ఈ నేపథ్యంలో రాజస్థాన్‎లో కూడా మార్చి 13 నుంచి 15 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఇవి ఆ ప్రాంత ప్రజలకు ఉపశమనం కల్గిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక దక్షిణ భారతదేశంలో ప్రధానంగా తమిళనాడులో కూడా ఈ ప్రభావం ఉంటుందని ఐఎండీ వెల్లడించింది. మార్చి 13న నాలుగు దక్షిణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీంతోపాటు కేరళ మాహే ప్రాంతాల్లో కూడా మార్చి 13న భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వెదర్ రిపోర్ట్ ప్రకటించింది.


ఇవి కూడా చదవండి:

Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..

Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 13 , 2025 | 11:02 AM