Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..
ABN , Publish Date - Mar 13 , 2025 | 08:23 AM
పాకిస్తాన్ జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. 24 గంటలకుపైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో పాక్ సైన్యం 346 మంది బందీలను విడిపించింది.

పాకిస్తాన్‌లోని జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ ఘటనకు సంబంధించి పాకిస్తాన్ సైన్యం నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ బుధవారం రాత్రి విజయవంతంగా ముగిసింది. ఈ ఆపరేషన్‌లో 346 మంది బందీలను సురక్షితంగా విడిపించారు. 24 గంటలకు పైగా కొనసాగిన ఈ ఆపరేషన్‌లో, రైలును హైజాక్ చేసిన 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ఉగ్రవాదులు మరణించారు. బుధవారం రాత్రి ఉగ్రవాదులందరినీ హతమార్చడం ద్వారా, ప్రయాణీకులందరినీ సురక్షితంగా రక్షించి, సాయుధ దళాలు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు.
పెషావర్‌కు వెళ్తుండగా
ఈ దాడిలో 21 మంది ప్రయాణికులు, నలుగురు పారామిలిటరీ సిబ్బంది మరణించారు. బలూచిస్తాన్‌లో తిరుగుబాటుదారులు జఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును స్వాధీనం చేసుకుని, ప్రయాణికులను బందీగా తీసుకున్నారు. ఈ రైలు క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌కు వెళ్తుండగా, తిరుగుబాటుదారులు బ్లాస్ట్ చేసిన క్రమంలో జరిగింది.
ఇందుకే ఆపరేషన్ ఆలస్యం..
ఈ దాడికి BLA బాధ్యత వహించింది. రైలులో దాదాపు 440 మంది ప్రయాణికులు ఉన్నారని, మంగళవారం రాత్రి 168 మంది, బుధవారం 178 మందితో సహా మొత్తం 346 మందిని రక్షించినట్లు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే ఉగ్రవాదుల సమక్షంలో మహిళలు, పిల్లలు ఉన్న క్రమంలో ఆపరేషన్ ఆలస్యమైందన్నారు. ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారి, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులతో చురుకుగా సంప్రదింపులు చేశారని కూడా వెల్లడించారు.
పాక్ ప్రభుత్వానికి వార్నింగ్
దీనికి ముందు BLA బుధవారం మధ్యాహ్నం పాకిస్తాన్ ప్రభుత్వానికి 24 గంటల అల్టిమేటం జారీ చేసింది. బందీలను మార్పిడి చేసుకోవాలని లేదా పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. BLA ఇప్పటివరకు 100 మంది పాకిస్తాన్ సైనికులను చంపి 150 మందిని బందీలుగా ఉంచుకున్నామని తెలిపింది. పాకిస్తాన్ సైన్యం తమపై దాడులు కొనసాగిస్తే, మిగిలిన బందీలను కూడా చంపేస్తామని హెచ్చరించింది.
పాకిస్తాన్ కీలక నిర్ణయం
BLAను పాకిస్తాన్, ఇరాన్, చైనా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై తీవ్ర చర్చలను ప్రేరేపించింది. పాకిస్తాన్ సైన్యం ఈ దాడిని తీవ్రంగా తీసుకుంటూ, భద్రతా చర్యలను మరింత కఠినంగా చేయాలని నిర్ణయించింది. BLA వంటి ఉగ్రవాద సంస్థలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది.
ఇవి కూడా చదవండి:
Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..
Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..
Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL Offers: రూ. 200 బడ్జెట్‌లోపు బెస్ట్ రీఛార్జ్ పాన్లు.. ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయంటే..
Read More Business News and Latest Telugu News