Vice President : ఆస్పత్రి నుంచి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ డిశ్చార్జ్..
ABN , Publish Date - Mar 12 , 2025 | 02:37 PM
Vice President : గుండెపోటు కారణంగా ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ చికిత్స తర్వాత క్రమంగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుండటంతో ఇవాళ డిశ్చార్జి చేశారు. ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం రాబోయే కొద్దిరోజులు..

Vice President : అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి రావడంతో మార్చి 9న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్. గుండె సంబంధిత సమస్యల కారణంగా యాంజియోప్లాస్టీ చికిత్స పొందిన తర్వాత స్పెషలిస్ట్ కార్డియాలజిస్టుల పర్యవేక్షణలో ఉన్న ఆయన ఇవాళ డిశ్చార్జి అయ్యారు. ఎయిమ్స్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం, ఉపరాష్ట్రపతి ఆరోగ్యం చికిత్స తర్వాత మెరుగుపడినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం మరికొన్ని రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు.
గుండె సంబంధిత సమస్యలు తలెత్తడంతో 73 ఏళ్ల వయసున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖడ్ మార్చి 9న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స తర్వాత నాలుగు రోజుల ఆస్పత్రిలోనే ఉన్న ఆయన ఆస్పత్రి నుంచి ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా రాబోయే కొద్ది రోజులు తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఉపరాష్ట్రపతికి సూచించారు. ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం ఎయిమ్స్‌లోని వైద్య బృందం ఈ సూచనలు చేశారు. కోలుకున్న తర్వాత విధుల్లో చేరుతారని ఎయిమ్స్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఆదివారం మార్చి 9న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఎయిమ్స్‌ని సందర్శించి ఉపరాష్ట్రపతి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. Xలో ఒక పోస్ట్‌లో ప్రధాని మోదీ "ఎయిమ్స్‌కి వెళ్లి ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధంఖడ్ గారి ఆరోగ్యం గురించి ఆరా తీశాను. ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను" అని పేర్కొన్నారు.
భారతదేశ 14వ ఉపరాష్ట్రపతి
ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ ఆగస్టు 11, 2022న 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. జూలై 18, 1951న రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న కాలిబంగాలో జన్మించిన ఆయన భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో అనుబంధం కలిగి ఉన్నారు. ఉపరాష్ట్రపతి కావడానికి ముందు ఆయన పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో న్యాయ పట్టా పొందిన ధన్‌ఖడ్ అనుభవజ్ఞుడైన న్యాయవాది, సామాజిక కార్యకర్త. ఆయన అనేక సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు.
Read Also : CM Stalin: సీఎం స్టాలిన్ ఆగ్రహం.. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా..
Chennai: బోర్డులు తమిళంలో ఉండాలి..
Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..