Chennai: బోర్డులు తమిళంలో ఉండాలి..
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:27 PM
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమిళంలో ‘నేమ్ బోర్డులు’ లేని దుకాణాలపై చర్యలు చేపట్టేందుకు కార్పొరేషన్ అధికారులు సిద్ధమవుతున్నారు.

చెన్నై: తమిళంలో ‘నేమ్ బోర్డులు’ లేని దుకాణాలపై చర్యలు చేపట్టేందుకు గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (Greater Chennai Corporation) సిద్ధమవుతోంది. పారిశ్రామిక సంస్థలు, దుకాణలు తమ నేమ్ బోర్డుల్లో పెద్ద సైజులో తమిళం, దాని కంటే చిన్నగా ఇంగ్లీషు, దానికి తక్కువ సైజులో ఆసక్తి ఉన్న, ఇతర భాషల్లో పేర్లుండాలని నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను పలు దుకాణ యజమానులు పాటించడం లేదని, నేమ్ బోర్డుల్లో ఇంగ్లీషు, హిందీ తదితర భాషల పేర్లు పెద్దవిగా ఏర్పాటుచేస్తున్నారని జీసీసీకి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..
జీసీసీ(GCC) పరిధిలో సుమారు 70వేల దుకాణాలున్నాయి. కాగా, ప్యారీస్, షావుకారుపేట తదితర ప్రాంతాల్లోని దుకాణాల నేమ్ బోర్డులు తమిళంలో లేవని తేలింది. అలా, తమిళంలో పేర్లు ఏర్పాటుచేయని దుకాణ యజమానులకు తొలుత సంజాయిషీ కోరుతూ నోటీసు పంపాలని అధికారులు నిర్ణయించారు. వారం రోజుల్లోగా ఈ విషయమై సంజాయిషీ ఇవ్వని దుకాణాల లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
చెన్నై, కోవై, మదురై, తిరుచ్చి, సేలం(Chennai, Selam), తిరునల్వేలి తదితర ముఖ్యమైన నగరాల్లో కూడా తమిళంలో పేరు నేమ్ బోర్డులో తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని, ఈ నిబంధన పాటించని దుకాణ యజమానులపై చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, మంగళవారం జరిగిన సమావేశంలో, తమిళంలో పేర్లు లేని దుకాణాలకు నోటీసులు జారీచేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
లంచాలు మరిగి.. వలకు దొరికి.. !
అమెరికాలోనే పేపాల్ డాటా లీకేజీ!
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు
Read Latest Telangana News and National News