SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 04:50 AM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం కూలిన షీర్ జోన్ ప్రాంతంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. గల్లంతైన వారిలో కొంత మంది అక్కడ ఇరుక్కొని ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి.

రంగంలోకి మొత్తం నాలుగు రోబోలు
షీర్‌జోన్‌లో సహాయక చర్యల కోసం..
మహబూబ్‌నగర్/అచ్చంపేట, మార్చి 11 (ఆం ధ్రజ్యోతి ప్రతినిధి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల కోసం రోబోలను వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సొరంగం కూలిన షీర్ జోన్ ప్రాంతంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. గల్లంతైన వారిలో కొంత మంది అక్కడ ఇరుక్కొని ఉంటారని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. అయితే రెస్క్యూ బృందాలు లేదా యంత్రాలు అక్కడికి వెళ్లి తవ్వకాలు జరిపితే మళ్లీ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆ ప్రాంతంలో రోబోల ను వినియోగించాలని నిర్ణయించారు. అందుకోసం రూ.4 కోట్లు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు చెందిన అన్వీ రొబోటిక్స్ ఈ బాధ్యతలను తీసుకుంది. మంగళవారం సంస్థ ప్రతినిధులు ఒక మద ర్ రోబోను తీసుకొచ్చారు. కమ్యూనికేషన్, నావిగేషన్ తదితర ఏర్పాట్లు చేసుకునేందుకు ఆ రోబోను లోపలికి తీసుకెళ్లారు.
బుధవారం ఉదయం వరకు మరో మూడు రోబోలు టన్నెల్‌కు చేరుకోనున్నాయి. మదర్ రోబో మిగతా రోబోలతో సమన్వయం చేసుకుంటుంది. మిగిలిన మూడు రోబోల్లో ఒకటి బండ రాళ్లను తుక్కు చేసి బయటకు తరలిస్తుంది. మరొకటి గట్టిగా ఉన్న మట్టిని తవ్వుతుంది. ఇంకొకటి బు రదను బయటకు తీసి పంపిస్తుంది. అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంటే మదర్ రోబో గుర్తిస్తుంది. టన్నెల్‌లో డీ1, డీ2 ప్రాంతంలో తవ్వకాలు సాగుతుండగా మరోసారి క్యాడవర్ డాగ్స్‌ను లోపలకు తీసుకెళ్లి పరిశీలన చేశారు. డీ2 ప్రాంతంలో తవ్వకాలు దాదాపు పూర్తి కాగా అక్కడి నుంచి డీ1కు గుంత తవ్వుతున్నారు. డీ1 దగ్గర బుధవారం వరకు కార్మికుల జాడ లభించే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Jagtial wedding tragedy: 24 గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు... చివరకు
Telangana MPs Meet: తెలంగాణ ఎంపీల సంచలన నిర్ణయం.. వాటి కోసం ప్రతిపాదనలు సిద్ధం..