Share News

Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..

ABN , Publish Date - Mar 12 , 2025 | 11:58 AM

దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాదిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయనున్నట్లు తెలిపారు.

Shashikala: ఈసారి రెండాకుల గుర్తుపైనే పోటీ..

- మాజీ మంత్రి వైద్యలింగానికి శశికళ భరోసా

చెన్నై: వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేసి గెలుద్దామంటూ మాజీ సీఎం పన్నీర్‌సెల్వం(Former CM Panneerselvam) అనుచరుడు, మాజీ మంత్రి వైద్యలింగానికి శశికళ(Shashikala) భరోసా ఇచ్చారు. ఇటీవల వైద్యలింగం తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొంది తంజావూరు జిల్లా ఒరత్తనాడు సమీపం తెలుంగన్‌కుడికాడులోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Student: ఆ విద్యార్థినికి ఎంత కష్టం వచ్చిందో పాపం...


nani2.jpg

ఈ విషయం తెలుసుకున్న శశికళ మంగళవారం తన సోదరుడు దివాకరన్‌తో కలిసి వైద్యలింగం నివాసానికి వెళ్ళి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ.. ఎలాంటి దిగులు పడాల్సిన అవసరం లేదని, వచ్చే యేడాది సరికి అందిరికీ మంచిరోజులు వస్తాయని, అసెంబ్లీ ఎన్నికల్లో రెండాకుల గుర్తుపైనే పోటీ చేయడం ఖాయమని భరోసా ఇచ్చారు. మళ్ళీ రాష్ట్రంలో జయ పాలన రావటం తథ్యమని కూడా శశికళ ప్రకటించారు. ప్రస్తుతం వైద్యలింగంతో శశికళ భేటీ కావటం సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 11:58 AM