Share News

CM Stalin: సీఎం స్టాలిన్ ఆగ్రహం.. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా..

ABN , Publish Date - Mar 12 , 2025 | 01:14 PM

కేంద్ర ప్రభుత్వంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా.. అంటూ మండిపడ్డారు. చెండల్పట్టులో జరిగిన సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

CM Stalin: సీఎం స్టాలిన్ ఆగ్రహం.. మీ మాట వినకుంటే నిధులు ఆపేస్తారా..

- ఇలాంటి కేంద్రప్రభుత్వాన్ని చూడడం తమిళులకిదే ప్రథమం

- త్వరలోనే తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం

- లోక్‌సభలో రాష్ట్ర ఎంపీల పోరాటం భేష్‌

- చెంగల్పట్టు సభలో సీఎం స్టాలిన్‌

చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఓ విద్యావిధానాన్ని ఆమోదించకపోతే నిధులను ఆపేస్తామంటూ బెదిరించే కేంద్ర ప్రభుత్వాన్ని తొలిసారిగా తమిళ ప్రజలు చూస్తున్నారని, త్వరలో వారికి తగిన గుణంపాఠం చెప్పేందుకు కూడా సిద్ధంగా ఉన్నారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. హిందీ, సంస్కృత భాషలను నిర్బంధంగా అమలు చేయడం, విద్యను ప్రైవేటుపరం చేయడం, ధనవంతులకే ఉన్నతవిద్యావకాశాలు కల్పించడం, విద్యలో మతత్తత్వ వాదాన్ని జొప్పించడం వంటి విద్యా వ్యతిరేక విధానాలను ప్రతిపాదించే జాతీయ విద్యావిధానాన్ని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: బోర్డులు తమిళంలో ఉండాలి..


చెంగల్పట్టులో మంగళవారం ఉదయం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆ జిల్లాలో రూ.280.38 కోట్లతో పూర్తయిన పథకాలను ప్రారంభించి, రూ.497.06 కోట్లతో చేపట్టనున్న కొత్త పథకాలకు శంకుస్థాపన చేసి, పలువురు లబ్ధిదారులకు సహాయాలు అందజేశారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ.. లోక్‌సభలో సోమవారం డీఎంకే ఎంపీలు అనుసరించిన తీరు, కేంద్రంపై చేసిన విమర్శలు ప్రశంసనీయమని, ప్రత్యేకించి విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తమిళ ఎంపీలను అనాగరికులంటూ చేసిన విమర్శలను ఖండించిన తీరు కూడా సమర్థనీయమన్నారు.


రాష్ట్ర విద్యాహక్కులను కాపాడుకునేలా లోక్‌సభలో ఎంపీలు చేసిన వాదనల ఈ సభా ముఖంగా ప్రశంసించడంతో పాటు వారికి ధన్యవాదాలు తెలిపారు. తమిళుల ఆత్మ గౌరవానికి భంగం కలిగితే చూస్తూ ఊరుకోరని దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెబుతుండేవారని, ఆ రీతిలోనూ డీఎంకే ఎంపీలు తమిళుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేలా లోక్‌సభలో పాలకపక్షాన్ని నిలదీశారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి జాతీయ విద్యావిధానం పేరిట ఏర్పడనున్న ముప్పును ముందస్తుగానే గ్రహించి ఆ విద్యావిధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని, ఈ ఉద్యమానికి తమిళ ప్రజలంతా గట్టి మద్దతు ఇవ్వాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు.


సెయ్యూరులో సిప్కాట్‌ పార్క్‌...

చెంగల్పట్టు జిల్లాను పారిశ్రామికంగా మరింతగా అభివృద్ధిపరిచేందుకు సెయ్యూరులో 800 ఎకరాల్లో కొత్త సిప్కాట్‌ ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్ముడి, రామచంద్రన్‌, దామో అన్బరసన్‌, ఎంపీలు టీఆర్‌ బాలు, సెల్వం, శాసనసభ్యులు వరలక్ష్మి, రాజా, ఇ.కరుణానిధి, అరవింద్‌ రమేష్, బాలాజీ, బాబు, రెవెన్యూ శాఖ అదనపు ప్రభుత్వ కార్యదర్శి అముదా, కమిషనర్‌ పళనిస్వామి, జిల్లా కలెక్టర్‌ ఆరుణ్‌రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లంచాలు మరిగి.. వలకు దొరికి.. !

అమెరికాలోనే పేపాల్‌ డాటా లీకేజీ!

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లోకి రోబోలు

నిఘా నీడలో ఇంటర్‌ పరీక్షలు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 12 , 2025 | 01:15 PM