Share News

Student Making Bombs: రాంచీలో ISIS కోసం బాంబులు తయారు చేసిన విద్యార్థి

ABN , Publish Date - Sep 20 , 2025 | 04:29 PM

జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని ఒక హోటల్ రూమ్‌లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ ఒక విద్యార్థి పట్టుబడ్డాడు. SSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకుంటూ అష్హార్ డానిష్ అనే యువకుడు..

Student Making Bombs: రాంచీలో ISIS కోసం బాంబులు తయారు చేసిన విద్యార్థి
Student Making Bombs for ISIS

జార్ఖండ్‌, సెప్టెంబర్ 20: రాంచీలోని ఒక హోటల్ రూమ్‌లో ISIS ఉగ్రవాదుల కోసం బాంబులు తయారు చేస్తూ ఒక విద్యార్థి పట్టుబడ్డాడు. ఇది స్థానికంగా సంచలనం రేకెత్తించింది. SSC పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నానని చెప్పుకుంటూ అష్హార్ డానిష్ అనే యువకుడు రాంచీలోని ఇస్లామ్‌నగర్ ప్రాంతంలోని తబారక్ లాడ్జ్ హోటల్ రూమ్ నంబర్ 15లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఈ రూమ్‌ను బాంబు తయారీకి మాత్రమే కాకుండా, ఉగ్రవాదుల నియామక కేంద్రంగానూ ఉపయోగించాడు.


ఢిల్లీ పోలీసులు అఫ్తాబ్ ఖురేషీ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఆపరేషన్ గురించి బయటపడింది. అఫ్తాబ్ గురించి వచ్చిన సమాచారంతో జార్ఖండ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌తో కలిసి రైడ్‌లు నిర్వహించిన ఢిల్లీ పోలీసులు డానిష్‌ను పట్టుకున్నారు. రూమ్‌లో గన్‌పౌడర్, బాంబులు, పొటాషియం నైట్రేట్ (ఎరువుల్లో ఉండే రసాయనం), PETN, యాసిటోన్ పెరాక్సైడ్ (సాతాన్ తల్లి అని పిలుస్తారు) వంటి పేలుడు పదార్థాలు సొంతంగా తయారు చేసిన ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బాంబులను పరీక్షించేందుకు సబర్నరేఖ నదిలో పేల్చినట్లు కూడా పోలీసులు తెలిపారు.


డానిష్‌ను పాకిస్థాన్ హ్యాండ్లర్ సోషల్ మీడియా ద్వారా రిక్రూట్ చేసి రాడికలైజ్ చేశారని పోలీసులు వెల్లడించారు. సిగ్నల్ యాప్‌లో 'ఇంటర్న్ ఇంటర్వ్యూ' లేదా 'బిజినెస్ ఐడియా' వంటి సాధారణ పేర్లతో ఎన్‌క్రిప్టెడ్ గ్రూప్‌లు ఏర్పాటు చేసి ఉగ్రవాదుల నియామకం, ఫండ్స్ సేకరణ చేశారు. అమెజాన్ నుంచి కెమికల్స్, తదితరాలు ఆర్డర్ చేసి బాంబులు తయారు చేసేవారు. ఈ సెల్‌లో సుఫియాన్ ఖాన్, మొహమ్మద్ హుజైఫ్ యామన్, కమ్రాన్ ఖురేషీ వంటి మరో పన్నెండు మంది అరెస్ట్ అయ్యారు. వీరు సీనియర్ BJP నాయకులు, మత స్థలాలపై దాడులు ప్లాన్ చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.


ఈ ఘటన భారతదేశంలో ISIS నెట్‌వర్క్‌ల ప్రమాదాన్ని, సోషల్ మీడియా ద్వారా రాడికలైజేషన్‌ను ఎత్తిచూపుతోంది. అంతేకాదు, పాకిస్థాన్ సాయంతో అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌లు భారత్‌లో ఎలా నడుస్తున్నాయో కూడా చెబుతోంది. పోలీసులు దీనికి సంబంధించి మరిన్ని సోదాలు నిర్వహించి ఈ వ్యవస్థని తుదిముట్టించాలని అడుగులు వేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మోదీ బలహీన ప్రధాని.. హెచ్-1బి వీసాలపై యూఎస్ నిర్ణయంపై రాహుల్ విమర్శ

విదేశాలపై ఆధారపడొద్దని ఎప్పటినుంచో చెబుతున్నా: ప్రధాని మోదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Sep 20 , 2025 | 05:32 PM