Andhra Pradesh: ఒంటరిగా ఉంటున్నారా..? జర జాగ్రత్త..! ఇలాంటోళ్లు ఉంటారు..!
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:22 PM
గ్రామాల్లో చాలా మంది వృద్ధులు ఒంటరిగా నివసిస్తుంటారు. ఉపాధి నిమిత్తం కుటుంబ సభ్యులు ఇరత ప్రాంతాలకు వెళ్లడమే.. వేరే ఊర్లు, పట్టణాల్లో స్థిరపడటమో చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వృద్ధులు ఉన్న ఊరిని విడిచి రాలేక..
పశ్చిమగోదావరి, సెప్టెంబర్ 20: గ్రామాల్లో చాలా మంది వృద్ధులు ఒంటరిగా నివసిస్తుంటారు. ఉపాధి నిమిత్తం కుటుంబ సభ్యులు ఇరత ప్రాంతాలకు వెళ్లడమే.. వేరే ఊర్లు, పట్టణాల్లో స్థిరపడటమో చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో వృద్ధులు ఉన్న ఊరిని విడిచి రాలేక.. గ్రామస్తులతో బంధాన్ని వీడలేక.. ఇంట్లో ఒంటరిగానే ఉంటుంటారు. మరికొందరు భర్త చనిపోయో.. తదితర కారణాలతో ఒంటరిగా జీవనం సాగిస్తుంటారు. ఇలాంటి వారినే టార్గెట్ చేసుకుని కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో ఒంటరి మహిళలు, ఒంటరిగా జీవిస్తున్న వృద్ధులపై దాడుల ఘటనలు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కాళీపట్నంలో దారుణం చోటుచేసుకుంది ఒంటరిగా నివాసం ఉంటున్న బళ్ల సూర్య ఆదిలక్ష్మి అనే 55 సంవత్సరాల వృద్ధురాలిపై దుండగుడు దాడికి పాల్పడ్డారు. ఆపై ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసులు, చెవులకున్న దుద్దులు, ఇంట్లో నగదు దోచుకుపోయాడు. ఆమె కేకలకు చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేసరికి ఆదిలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉంది. చెక్కతో తలపై బాధటంతో అపస్మారస్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆమె పరిస్థితి విషమించడంతో అంబులెన్స్‌లో అమలాపురం తరలించారు. రంగంలోకి దిగిన మొగల్తూరు పోలీసులు ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
Delhi Encounter: ఢిల్లీలోని రోహిణిలో ఎన్‌కౌంటర్.. ముగ్గురు గోగి గ్యాంగ్ సభ్యుల అరెస్టు
Gadari Kishore Police Inquiry: ముగిసిన విచారణ.. గాదరి కిషోర్ ఏమన్నారంటే
For More Andhra Pradesh News and Telugu News..