Share News

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Sep 17 , 2025 | 11:43 AM

ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్‌-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

Special Trains: ఆయుధపూజ, దీపావళి సందర్భంగా ప్రత్యేక రైళ్లు..

చెన్నై: ఆయుధపూజ, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. - నెం.06012 నాగర్‌కోయిల్‌-తాంబరం ప్రత్యేక వారాంతపు సూపర్‌ ఫాస్ట్‌ రైలు ఈ నెల 28, అక్టోబరు 5,12,19,26 తేదీల్లో (ఆదివారం) నాగర్‌కోయిల్‌లో రాత్రి 11.15 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తాంబరం చేరుకుంటుంది.


మరుమార్గంలో, నెం.06011 తాంబరం-నాగర్‌కోయిల్‌ ప్రత్యేకవారాంతపు సూపర్‌ఫాస్ట్‌ రైలు ఈనెల29, అక్టోబరు 6,13,20,27 తేదీల్లో తాంబరంలో మధ్యాహ్నం 3.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 5.15 గంటలకు నాగర్‌కోయిల్‌ చేరుకుంటుంది. - నెం.06123 చెన్నై సెంట్రల్‌-పోదనూరు వారాంతపు సూపర్‌ ఫాస్ట్‌ స్పెషల్‌ ఈ నెల 25, అక్టోబరు 2,9,16,23 తేదీల్లో చెన్నై సెంట్రల్‌ నుంచి రాత్రి 11.50 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 8.30 గంటలకు పోదనూరు చేరుకుంటుంది.


nani4.2.jpg

మరుమార్గంలో, నెం.06124 పోదనూరు- చెన్నై సెంట్రల్‌ వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ స్పెషల్‌ ఈ నెల 26, అక్టోబరు 3,10,17,24 తేదీల్లో పోదనూరు నుంచి సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు వేకువజామున 3.15 గంటలక చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అది నేలకొండపల్లి ఎందుకు కాకూడదు!?

సిందూర్‌ తో మసూద్‌ కుటుంబం చిన్నాభిన్నం

Read Latest Telangana News and National News

Updated Date - Sep 17 , 2025 | 12:48 PM