Lokayukta Raids: రిటైర్డ్ ఇంజినీర్ ఇళ్లలో సోదాలు.. కిలోల కొద్దీ బంగారం, టన్నుల్లో తేనె లభ్యం
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:52 PM
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అధికారులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఇంజనీర్ ఇళ్లల్లో సంపద చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
తీగ లాగితే డొంక కదిలినట్లు.. అధికారులు చేస్తున్న దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఇంజనీర్ ఇళ్లల్లో సంపద చూసి అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. లోకాయుక్త అధికారులు (Lokayukta Raids) నిర్వహించిన సోదాల్లో భారీగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి బయపడ్డాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయన ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనె లభ్యమవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇంజనీర్ ఫామ్‌హౌస్‌లో ఇంత భారీ స్థాయిలో తేనె ఉండటం ఏంటి? అని అధికారులు లోతైన పరిశీలన చేస్తున్నారు. భోపాల్‌లో ప్రజా పనుల విభాగంలో చీఫ్ ఇంజినీర్‌గా జీపీ మెహ్రా పనిచేసి రిటైర్ కాగా.. ఇతని ఇళ్లపై అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈయన లగ్జరీ లైఫ్ చూసి అధికారులే ఒకింత ఆశ్చర్యపోయారు.
ఇన్ని ఆస్తులను ఈయన ఎలా కూడగట్టాడు? అసలేంటి ఈయన కథ? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో లోకాయుక్త అధికారులు దర్యాప్తు చేస్తుండగా జీపీ మెహ్రా పేరు బయటకు వచ్చింది. ఆయనపై దృష్టి సారించిన అధికారులు.. మెహ్రా ఇళ్లపై దాడులు నిర్వహించారు. భోపాల్, నర్మదాపురంలోని ఆయన ఇళ్లల్లో నలుగురు డీఎస్పీ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. మణిపురంలోని మెహ్రా నివాసంలో 8.79లక్షల నగదు, రూ.50లక్షల విలువ చేసే ఆభరణాలు, రూ.56లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లను అధికారులు గుర్తించారు. దనా పానీలో మెహ్రాకు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఈ ఇంట్లో విస్తృత తనిఖీలు నిర్వహించగా భారీగా నోట్ల కట్టలు, రూ.3 కోట్ల విలువ చేసే రూ.2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించినట్లు జాతీయ మీడియా కథనం పేర్కొంది.
ఇది మాత్రమే కాదండోయ్.. దర్యాప్తులో ఇంకా చాలా బయటపడ్డాయి. నర్మదాపురంలోని ఫామ్‌హౌస్ లో కళ్లుచెదిరే లగ్జరీ సముదాయాలు చూసి షాక్ అయ్యారు. రిటైర్డ్ ఇంజనీర్‌కు చెందిన ఫామ్ హౌస్‌లో నిర్మాణ దశలో ఉన్న 32 అధునాతన కాటేజీలు చూసి ఖంగుతిన్నారు. మరో ఏడు కాటేజీలు పూర్తి అయినట్లు చెప్పారు. అయితే ఫామ్ హౌస్ మధ్యలో చెరువు, గోశాల, ఆలయం, నాలుగు లగ్జరీ కార్లు ఉన్నట్లు తేల్చారు. అంతే కాకుండా ఆయన ఫామ్‌హౌస్ నుంచి 17 టన్నుల తేనెను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఆయన తేనె సాగు చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై క్షేత్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతోందని, మెహ్రా సంపద వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చని భావిస్తున్నారు. మెహ్రాకు సంబంధించి బ్యాంకు రికార్డులు, డిజిటల్ ఫైళ్లను ఫోరెన్సిక్ బృందాలు తనిఖీలు నివహిస్తున్నారు. మెహ్రా బినామీ పెట్టుబడుల పైనా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..
Read Latest AP News And Telugu News