Share News

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. పోటీలో ఇద్దరు అభ్యర్థులు..

ABN , Publish Date - Aug 22 , 2025 | 07:49 PM

2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీన విడుదలై ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్‌ల దాఖలు చివరి తేదీ ఆగస్టు 21 కాగా, పరిశీలన ఆగస్టు 22వ తేదీన ముగిసింది. మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలు దాఖలు అయ్యాయి.

Vice Presidential Election: ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల పరిశీలన పూర్తి.. పోటీలో ఇద్దరు అభ్యర్థులు..
Vice Presidential Election

న్యూ ఢిల్లీ, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): 2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల (Vice Presidential Election) నోటిఫికేషన్ ఆగస్టు 7వ తేదీన విడుదలై ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్‌ల దాఖలు చివరి తేదీ ఆగస్టు 21 కాగా, పరిశీలన ఆగస్టు 22వ తేదీన ముగిసింది. మొత్తం 46 మంది అభ్యర్థులు 68 నామినేషన్ పత్రాలు ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం దాఖలు అయ్యాయి.


వీటిలో 28 నామినేషన్ పత్రాలు (19 మంది అభ్యర్థులవి) చట్టపరమైన కారణాలతో తిరస్కరించారు. మిగిలిన 40 నామినేషన్ పత్రాలు (27 మంది అభ్యర్థులవి) ఆగస్టు 22వ తేదీన ఉదయం 11 గంటలకు పరిశీలించారు. ఈ పరిశీలనలో కొన్ని నామినేషన్లు 1952 ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం సెక్షన్ 5B(1)(b), 5B(1)(b) , 5C ప్రకారం తిరస్కరించారు. చివరిగా, కేవలం ఇద్దరి అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి.


పోటీలో ఇద్దరు అభ్యర్థులు..

1. సీపీ రాధాకృష్ణన్ (నామినేషన్ పత్రాల సంఖ్యలు 26, 27, 28, 29)

2. బుచ్చిరెడ్డి సుదర్శన్ రెడ్డి (నామినేషన్ పత్రాల సంఖ్యలు 41, 42, 43, 44)

ఈ ఇద్దరు అభ్యర్థులే ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం పోటీలో నిలిచారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వెబ్ సిరిస్‌లో మోదీ మాజీ బాడీగార్డ్

పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

For More National News And Telugu News

Updated Date - Aug 22 , 2025 | 07:57 PM