Rajnath Singh: అయోధ్యలో ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవం.. ఆలయంపై రాజ్‌నాథ్ పతాకావిష్కరణ
ABN , Publish Date - Dec 31 , 2025 | 02:40 PM
వీవీఐపీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. స్థానిక పోలీసులు పలు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యను 5 జోన్లు, 10 సెక్యూరిటీ సెక్టార్ల కింద విభజించినట్టు సిటీ ఎస్పీ సీపీ త్రిపాఠి తెలిపారు.
అయోధ్య: అయోధ్యలోని రామాలయంలో ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి కార్యక్రమంలో భాగంగా అన్నపూర్ణ ఆలయంపై కాషాయ పతాకాన్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) బుధవారంనాడు ఆవిష్కరించారు. ప్రాణ్ ప్రతిష్ట ద్వితీయ వార్షికోత్సవంలో రాజ్‌నాథ్ చీఫ్ 'యజమాన్'గా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా రాజ్‌నాథ్ వెంట హాజరయ్యారు.
దీనికి ముందు రాజ్‌నాథ్ సింగ్, యోగి ఆదిత్యనాథ్ కలిసి హనుమాన్‌గర్హి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రామాలయంలోని రామ్‌లల్లాను దర్శించి పూజల్లో పాల్గొన్నారు. ఈ వారం ప్రారంభంలో మొదలైన ప్రాణ్ ప్రతిష్ట ద్వాదశి వేడుకలు శుక్రవారం వరకూ కొనసాగుతాయి. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 2024 జనవరి 22న జరిగింది. కోట్లాది మంది భక్తులు ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించారు. రెండో వార్షికోత్సవం దగ్గరపడుతుండటంతో రామ్‌లల్లాను దర్శించుకునేందుకు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు అయోధ్యకు వస్తారని శ్రీరామ్ జన్మనభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు అంచనా వేస్తోంది.
అయోధ్యలో భద్రత కట్టుదిట్టం
వీవీఐపీ పర్యటనలను దృష్టిలో ఉంచుకుని అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. స్థానిక పోలీసులు పలు అంచెల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్యను 5 జోన్లు, 10 సెక్యూరిటీ సెక్టార్ల కింద విభజించినట్టు సిటీ ఎస్పీ సీపీ త్రిపాఠి తెలిపారు. ప్రతిచోటా నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామని, వారు తమతమ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని చెప్పారు. అయోధ్య వ్యాప్తంగా 3,000 మంది పోలీసులతో భద్రతావలయం ఏర్పాటు చేశారు. అదనపు ఎస్పీలు, తొమ్మిది మంది సూపరింటెండెంట్లు, సుమారు 50 మంది ఇన్‌స్పెక్టర్లు, 150 మంది సబ్-ఇన్‌స్పెక్టర్లు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లను మోహరించారు. అదనంగా 5 కంపెనీల పీఏసీ, పారామిలటరీ బగలగాలను అయోధ్యలో అందుబాటులో ఉంచారు. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లతో నిఘాను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను యాక్టివేట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది పీఎమ్ కిసాన్ యోజన నిధులు!
ఆర్థిక నివేదికలు, వార్షిక రిటర్న్‌లను దాఖలు గడువు పెంపు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి