Rahul Gandhi: ఢిల్లీ పొల్యూషన్.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Nov 28 , 2025 | 01:49 PM
ప్రజల ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరమని.. ఢిల్లీ కాలుష్యంపై విమర్శలు చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీలో పెరుగుతున్న వాయి కాలుష్యంపై ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ వీడియోను ఇవాళ(శుక్రవారం) విడుదల చేశారు. తాను కలిసిన ప్రతి ఒక్కరూ కూడా ఢిల్లీ పొల్యూషన్ గురించే చెబుతున్నారని గుర్తు చేశారు. తమ బిడ్డలు విషపూరిత గాలి పీల్చుకుంటూ పెరుగుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. 'ప్రధాని గారు.. మన దేశంలోని పిల్లలు మన ముందే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు' అంటూ మోదీని ఉద్దేశిస్తూ వీడియోలో చెప్పుకొచ్చారు.
మీరు దీనిపై ఎలా మౌనంగా ఉండగలరు అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. ఢిల్లీ పొల్యూషన్‌పై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఢిల్లీ కాలుష్యంపై మోదీ ప్రభుత్వానికి ఓ ప్రణాళిక లేదని.. జవాబుదారీతనం అసలు లేదని విమర్శలు గుప్పించారు. ఢిల్లీ వాయు కాలుష్యంపై తక్షణ, వివరణాత్మకంగా పార్లమెంటులో చర్చ జరిగేలా చూడాలని సూచించారు.
ప్రజల ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ కాలుష్యంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. మన పిల్లలకు స్వచ్ఛమైన గాలి అవసరమని.. ఇప్పటికైనా ఢిల్లీ కాలుష్యంపై ప్రతిపక్షాలపై విమర్శలు చేయకుండా వెంటనే చర్యలు చేపట్టాలని మోదీ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్టే విధించలేం: హైకోర్టు
ఆయుధ విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన
Read Latest Telangana News and National News