Share News

Pahalgam Attack Supreme Court: పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:51 PM

Pahalgam Attack Supreme Court: పర్యాటకులే లక్ష్యంగా పహల్గామ్‌లో జరిగిన టెర్రిరిస్టుల అటాక్‌పై సుప్రీం కోర్టులో పిల్ దాఖలైంది. పహల్‌గావ్ దాడిలో భద్రతా ఏర్పాట్లేమీ లేవని తేలిందని న్యాయవాది విశాల్ తివారీ తెలిపారు.

Pahalgam Attack Supreme Court: పహల్గామ్ దాడిపై సుప్రీంకోర్టులో పిటిషన్
Pahalgam Attack Supreme Court

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో సుప్రీంకోర్టులో (Supreme Court) పిల్ దాఖలైంది. కొండ ప్రాంతాల్లో భద్రత పెంచేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్ వేశారు. కశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రకు భద్రత, పర్యాటకులకు రక్షణ కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో పేర్కొన్నారు. కొండ ప్రాంతాలకు వెళ్లే పర్యాటకుల రక్షణకు భద్రతా చర్యలు చేపట్టాలని, పర్యాటకులు పెద్దఎత్తున గుమికూడే ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంలో పిల్ దాఖలు చేశారు.


పర్యాటక ప్రదేశాలలో, మారుమూల కొండలు లోయ ప్రాంతాలలో సరైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలని, తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి సమయంలో తక్షణ వైద్య సహాయం అందించాలన్నారు. వేసవి కాలంలో అధిక సంఖ్యలో పర్యాటకులు కొండ, పర్వత ప్రాంతాలు సందర్శిస్తుండటంతో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ఉగ్రవాదుల దాడులు పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయన్నారు. పర్యాటకుల రక్షణకు భద్రతా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. పహల్గామ్ దాడిలో భద్రతా ఏర్పాట్లేమీ లేవని తేలిందన్నారు. భద్రతా చర్యల ద్వారా మాత్రమే ఉగ్రవాదుల దాడుల నుంచి పర్యాటకులను రక్షించగలమని సుప్రీం కోర్టు న్యాయవాది విశాల్ తివారీ పిల్‌లో పేర్కొన్నారు.

Pahalgam Terror Attack: వేడుక కోసం వెళ్లి.. విగత జీవిగా మారిన ఎస్‌బీఐ ఉద్యోగి


కాగా.. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌బాగ్ జిల్లాలోని పహల్గామ్‌ ప్రాంతంలో నిన్న(మంగళవారం) ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. పర్యాటకుల మతం అడిగి మరీ మారణకాండ సృష్టించారు ఉగ్రమూకలు. టెర్రరిస్టుల కాల్పుల్లో 27 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రదాడిని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. విషయం తెలిసిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) విదేశీ పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చేశారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) ఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. మరోవైపు ఉగ్రవాదులను ఏరివేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ దాడిని చైనా మినహా 20 దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి.

Pahalgam Terror Attack: ఉగ్రవాదుల చిత్రాలు విడుదల చేసిన నిఘా వర్గాలు


రూ.10 లక్షల పరిహారం

మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు జమ్ముకశ్మీర్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. లక్ష చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. బాధితులను వారి ఇళ్లకు తిరిగి పంపించేందుకు ఏర్పాట్లు చేశామని.. గాయపడిన వారికి మెరుగైన వైద్య సంరక్షణ అందించబడుతుందని సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: కాల్పులు జరిపిన ఉగ్రవాది ఫొటో విడుదల

Pahalgam Terror Attack: జస్ట్..పెళ్లయిన ఐదు రోజులకే..

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2025 | 02:01 PM