Delhi Drug Racket: దుబాయ్‌లో రూ.2500 కోట్ల డ్రగ్స్ రాకెట్ సూత్రధారి.. హై ప్రొఫైల్ లింకులు బహిర్గతం..
ABN , Publish Date - Sep 07 , 2025 | 03:25 PM
దేశంలో అతిపెద్ద డ్రగ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రగా డ్రగ్స్ మాఫియా నడిపిస్తున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తులో నిర్ధారణ అయింది.
దేశవ్యాప్తంగా భారీ డ్రగ్ నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ముఠా లింకులకు సంబంధించిన కీలక వివరాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) దర్యాప్తులో గుర్తించింది. దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ దందా సాగిస్తున్న పవన్ ఠాకూర్ అనే వ్యక్తిని ప్రధాన సూత్రధారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. నిందితుడు ఖరీదైన కార్లు, విల్లాలు కలిగి ఉన్నాడని.. విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని ఎన్‌సిబి దర్యాప్తులో తేలింది. ఈ మేరకు అతడిపై ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ కూడా జారీ చేసినట్లు సమాచారం.
2024 నవంబర్‌లో ఢిల్లీలో దాదాపు రూ.2,500 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడింది. ఏకంగా 82 కిలోల హై-గ్రేడ్ కొకైన్ స్మగ్లింగ్ చేస్తూ నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. దేశంలోనే ఈ స్థాయిలో మాదకద్రవ్యాల పట్టివేత జరగడం ఇదే తొలిసారి. ఈ కేసులో పవన్ ఠాకూర్ అనే నిందితుడు ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) తెలిపిన వివరాల ప్రకారం, సరుకును ట్రక్కులో దేశ రాజధానికి తరలించిన తర్వాత పంపిణీ కోసం గిడ్డంగిలో నిల్వ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పవన్ ఠాకూర్ దుబాయ్ కేంద్రంగా డ్రగ్స్ దందాను నడిపిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు ఎన్‌సిబి అధికారులు ఇంటర్నేషనల్ సిల్వర్ నోటీస్ జారీ చేశారు.
దర్యాప్తు అధికారులు తెలిపిన ప్రకారం, మొదట ఢిల్లీలో హవాలా ఏజెంట్‌గా ప్రస్థానం మొదలుపెట్టి క్రమంగా పెద్ద ఎత్తున మాదకద్రవ్యాల అక్రమ రవాణాలోకి దిగాడు. ఇతడు భారతదేశం, దుబాయ్‌లలో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడు. మాదకద్రవ్యాల సరఫరా ద్వారా వచ్చే నల్లధనాన్ని హవాలా మార్గం ద్వారా మళ్లిస్తుంటాడు. భారతదేశం, చైనా, సింగపూర్, హాంకాంగ్, UAEలలో క్రిప్టోకరెన్సీ ద్వారా నిందితుడు చేసి లావాదేవీలు, క్రాస్-బోర్డర్ షెల్ కంపెనీల ద్వారా చేసిన కార్యకలపాలకు సంబంధించిన ఆధారాలు సేకరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతడికి ఇప్పటికే పలుమార్లు ఈడీ సమన్లు జారీ చేసినప్పటికీ అధికారుల ముందు హాజరు కాలేదు. దీంతో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు పవన్ ఠాకుర్ పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇక, 2024 నవంబరులో ఢిల్లీలో కొకైన్ స్వాధీనం చేసుకున్న కొద్దికాలానికే పవన్ కుటుంబంతో సహా ఇండియా నుండి పారిపోయి దుబాయ్‌లో స్థిరపడ్డాడు. అక్కడ నుంచే స్మగ్లింగ్, మనీలాండరింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి
సోనూసూద్ గొప్ప మనసు.. ప్రాణాలకు రిస్క్ అని తెలిసినా కూడా..
మహిళల దారుణం.. తోటి మహిళను చెట్టుకు కట్టేసి..
For More National News