Share News

Next Week IPOs: వచ్చే వారం మార్కెట్ ఫుల్ బిజీ.. 9 ఐపీఓలు, 7 లిస్టింగ్‌లతో..

ABN , Publish Date - Sep 07 , 2025 | 02:51 PM

దేశీయ స్టాక్ మార్కెట్లో వచ్చే వారం మళ్లీ ఐపీఓల సందడి కొనసాగనుంది. ఎందుకంటే సెప్టెంబర్ 8వ తేదీ నుంచి మొదలయ్యే వారంలో మొత్తం తొమ్మిది ఐపీఓలు పెట్టుబడిదారుల ముందుకు రానున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Next Week IPOs: వచ్చే వారం మార్కెట్ ఫుల్ బిజీ.. 9 ఐపీఓలు, 7 లిస్టింగ్‌లతో..
Next Week IPOs

దేశీయ స్టాక్ మార్కెట్లో (stock Market) మళ్లీ ఐపీఓల వీక్ రానే వచ్చేసింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభమయ్యే వారంలో స్టాక్ మార్కెట్ ఫుల్ బిజీగా మారనుంది. ఎందుకంటే ఈ వారంలో మొత్తం 9 IPOలు సబ్‌స్క్రిప్షన్ కోసం రానున్నాయి (Upcoming IPOs September 8). అందులో 3 మెయిన్‌బోర్డ్ IPOలు, 6 SME IPOలు ఉన్నాయి. పెట్టుబడిదారులకు ఇది మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.


మెయిన్‌బోర్డ్ IPOలు

1. శృంగర్ హౌస్ IPO

  • మంగళసూత్ర తయారీ సంస్థ

  • తెరవబడే తేదీ: సెప్టెంబర్ 10

  • ముగిసే తేదీ: సెప్టెంబర్ 12

  • ధర: రూ. 155 - రూ. 165

  • లాట్ సైజు: 90 షేర్లు

  • మొత్తం షేర్లు: 2,43,00,000 (తాజా షేర్లు)

  • కనీస పెట్టుబడి: రూ. 14,850

2. అర్బన్ కంపెనీ IPO

  • గృహ, సౌందర్య సేవల సంస్థ

  • సేకరణ: రూ. 1,900 కోట్లు (రూ. 472 కోట్ల తాజా షేర్లు, రూ. 1,428 కోట్ల పాత షేర్లు)

  • కనీస పెట్టుబడి: రూ. 14,935

3. డెవ్ యాక్సిలరేటర్ IPO

  • కార్యాలయ స్థలాల నిర్వహణ సంస్థ

  • సేకరణ: రూ. 143.35 కోట్లు (తాజా షేర్లు)

  • కనీస పెట్టుబడి: రూ. 14,335


SME IPOలు

1. కృపాలు మెటల్స్ IPO

  • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 8

  • సేకరణ: రూ. 13.48 కోట్లు

  • ధర: రూ. 72

  • లాట్ సైజు: 1600 షేర్లు

  • కనీస పెట్టుబడి: రూ. 2,30,400

2. నీలాచల్ కార్బో మెటాలిక్స్ IPO

  • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 8

  • సేకరణ: రూ. 56.10 కోట్లు

  • ధర: రూ. 85

  • లాట్ సైజు: 1600 షేర్లు

  • కనీస పెట్టుబడి: రూ. 2,72,000

3. టౌరియన్ MPS IPO

  • తెరవబడే తేదీ: సెప్టెంబర్ 9

  • సేకరణ: రూ. 42.53 కోట్లు

  • ధర శ్రేణి: రూ. 162 - రూ. 171

  • లాట్ సైజు: 800 షేర్లు

  • కనీస పెట్టుబడి: రూ. 2,73,600


4. కార్బన్‌స్టీల్ ఇంజనీరింగ్ IPO

  • తెరవబడే తేదీ: సెప్టెంబర్ 9

  • సేకరణ: రూ. 42.53 కోట్లు

  • ధర: రూ. 151 - రూ. 159

  • లాట్ సైజు: 1600 షేర్లు

  • కనీస పెట్టుబడి: రూ. 2,54,400

5. జే అంబే సూపర్ మార్కెట్స్ IPO

  • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 10

  • సేకరణ: రూ. 18.46 కోట్లు

  • ధర: రూ. 74 - రూ. 78

  • లాట్ సైజు: 3200 షేర్లు

  • కనీస పెట్టుబడి: రూ. 2,49,600

6. ఎయిర్‌ఫ్లోవా రైల్ టెక్నాలజీ IPO

  • ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 11

  • సేకరణ: రూ. 91.10 కోట్లు

  • ధర: రూ. 133 - రూ. 140

  • లాట్ సైజు: 1000 షేర్లు

  • కనీస పెట్టుబడి: రూ. 2,80,000

  • వీటితోపాటు మరో 7 కంపెనీలు కూడా మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

సెప్టెంబర్ 2025లో బ్యాంక్ సెలవుల పూర్తి లిస్ట్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 07 , 2025 | 02:51 PM