Maharashtra Tragedy: భార్య ఫోన్ నంబర్ బ్లాక్ చేసిందని.. నలుగురు పిల్లలను చంపి తండ్రి సూసైడ్..
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:07 PM
కుటుంబకలహాలు ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. భార్య కాపురానికి రాకుండా ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందనే మనోవేదనతో ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. నలుగురు పిల్లలను దారుణంగా హతమార్చి తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో జరిగిన ఈ అమానవీయ ఘటన అందరి హృదయాలనూ కలచివేస్తోంది.
మహారాష్ట్రలో ఓ ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. భార్తభర్తల మధ్య చెలరేగిన కలహాలు పసిపిల్లల భవితవ్యాన్ని చిదిమేయడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. భార్య కాపురానికి రానని తెగేసి చెప్పడంతో ఫోన్ చేసి సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు భర్త. గొడవ కారణంగా ఆమె నంబర్ బ్లాక్ చేసింది. దీంతో మనోవేదనకు గురైన ఆ వ్యక్తి నలుగురు పిల్లలను గ్రామంలో ఉండే బావిలోకి బలవంతంగా తోసి హత్య చేశాడు. అనంతరం తానూ అదే బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయిన పిల్లలంతా 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలే కావడం స్థానికులను దిగ్భ్రాంతికి గురయ్యారు.
మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలో ఒక షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. కొర్హలే గ్రామంలో శనివారం ఒక తండ్రి తన నలుగురు పిల్లలను చంపి ఆపై ఆత్మహత్య చేసుకుని మరణించాడు.మృతులు అరుణ్ సునీల్ కాలే (30), తన కుమార్తె శివాని (9), కుమారులు ప్రేమ్ (7), వీర్ (6), కబీర్ (5) లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరుణ్ కాలే అహల్యానగర్ జిల్లాలోని శ్రీగొండ తాలూకాలోని చిఖాలి గ్రామంలో నివసిస్తున్నాడు. అతడి భార్య శిల్ప తన భర్తతో గొడవల కారణంగా ఇంటిని వదిలి నాసిక్ జిల్లా యెయోలాలోని పుట్టింటికి వెళ్లిపోయింది. పిల్లలు మాత్రం అహల్యానగర్‌లోని ఒక పాఠశాలలో చదువుకుంటున్నారు.
పోలీసుల దర్యాప్తులో తేలిందేంటంటే.. అరుణ్ ప్రతిరోజూ తన భార్యను తీవ్రంగా కొట్టేవాడు. దీంతో ఆగస్టు 4న అతడి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీనితో కోపంతో ఊగిపోయిన అరుణ్.. నువ్వు తిరిగి రాకపోతే పిల్లలను చంపేస్తానని భార్యను బెదిరించాడు. దీంతో ముందుగానే శిల్ప తన పిల్లలను భర్తకు అప్పగించవద్దని వారు చదివే స్కూల్ కు కాల్ చేసింది. కానీ అప్పటికే స్కూల్ నుంచి పిల్లలను తీసుకెళ్లిపోయాడు అరుణ్. ఆ తర్వాత వారంతా ఊరి చివర ఉన్న బావిలో శవాలై తేలారు.
ఇవి కూడా చదవండి..
రాహుల్‌కు ఈసీ అల్టిమేటం.. ఏడురోజులు గడువు
అంతా కృష్ణమయం... ద్వారకా ఎక్స్‌ప్రెస్ వేను జాతికి అంకితం చేసిన ప్రధాని
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి