Share News

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

ABN , Publish Date - Aug 08 , 2025 | 04:40 PM

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
Central Cabinet Meeting in New Delhi

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం ఉజ్వల యోజన కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. దాని కోసం రూ.12,060 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పింది. అసోం, త్రిపుర రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీకి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రూ.7,250 కోట్ల చొప్పున ప్రత్యేక ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. సాంకేతిక విద్య కోసం రూ.4,200 కోట్లు ప్రకటించినట్లు కేంద్రం వెల్లడించింది.


ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ కాలేజీల అప్‌గ్రేడ్‌కు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటిచింది. దేశీయ LPGలో నష్టాలకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం చెల్లించేందుకు రూ.30,000 కోట్లు కేటాయించినట్లు వివరించింది. మరక్కనం - పుదుచ్చేరి 4-లైన్ హైవే కోసం రూ. 2,157 కోట్లు కేటాయింపు జరిగినట్లు మోదీ సర్కార్ చెప్పుకొచ్చింది. అనంతరం అమెరికా విధించిన 50 శాతం సుంకాలపై కేబినెట్‌‌లో చర్చ జరిగింది.


అమెరికా సుంకాలకు భారత్‌ దీటైన కౌంటర్‌ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేసినట్లు భారత్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా క్షిపణుల కొనుగోళ్లు నిలిపివేసినట్లు భారత్‌ తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవల భారత్‌పై 50 శాతం టారిఫ్ విధిస్తూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి

ఉగ్రవాద ఏరివేత చర్యలతో కశ్మీర్ వాసుల అష్టకష్టాలు

భయపెడుతున్న బాబా వాంగ జ్యోష్యం.. ఆగస్టులో ఏం జరగబోతోంది?..

Updated Date - Aug 08 , 2025 | 05:07 PM