Share News

Festiv Special Trains: ఇండియన్ రైల్వే 150 పండుగ ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Aug 30 , 2025 | 05:10 PM

దక్షిణ మధ్య రైల్వే (SCR) అత్యధికంగా 48 రైళ్లను నడుపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.

Festiv Special Trains: ఇండియన్ రైల్వే 150 పండుగ ప్రత్యేక రైళ్లు
Festival special trains

న్యూఢిల్లీ: రాబోయే వరుస పండుగల సీజన్‌‌ను, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే (Indian Railways) 150 పూజా స్పెషల్ రైళ్లను (Puja Special Trains) నడుపనుంది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాల్లో 2,024 ట్రిప్పులు ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకూ ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతారు.


సౌత్ సెంట్రల్ మార్గంలో అత్యధికంగా..

దక్షిణ మధ్య రైల్వే (SCR) అత్యధికంగా 48 రైళ్లను నడుపనుంది. 684 ట్రిప్పులు పూర్తి చేస్తుంది. ఈ నిర్ణయంతో ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ నుంచి ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.


బిహార్ రూట్లపై ప్రత్యేక దృష్టి

ఏటా పండుగ సీజన్‌లో బిహార్‌కు పెద్దఎత్తున ప్రయాణికులు తరలివెళ్తుండటాన్ని దృష్టిలో ఉంచుకుని ఈస్ట్ సెంట్రల్ రైల్వే (ECR) 588 ట్రిప్పులతో 14 రైళ్లను నడుపనుంది. పాట్నా, గయ, దర్బంగా, ముజఫర్‌పూర్ వంటి ప్రధాన నగరాలను కలుపుతూ ఈ రైళ్లు ప్రయాణిస్తాయి.


ఏ జోన్ నుంచి ఎన్ని?

-దక్షిణ మధ్య రైల్వే (SCR)-48 రైళ్లు (హైద్రాబాద్, సికింద్రాబాద్, విజయవాడ రూట్లలో)

-తూర్పు మధ్య రైల్వే (ECR)-14 రైళ్లు (పాట్నా, గయ, దర్బంగా, ముజఫర్‌పూర్ రూట్లలో)

-ఈస్ట్రన్ రైల్వే (ER)-24 రైళ్లు (కోల్‌కతా, సీల్డా, హౌరా మార్గాల్లో)

-వెస్ట్రన్ రైల్వే (WR)-24 రైళ్లు (ముంబైస సూరత్, వడోదర రూట్లలో)

-సదరన్ రైల్వే (SR)- 10 రైళ్లు (చెన్నై, కోయంబత్తూరు, మదురై రూట్లలో - 66 ట్రిప్పులు)


అదనంగా ప్రత్యేక సర్వీసులు భువనేశ్వర్, పూరి, సంబల్‌పూర్ (ఈస్ట్ కోస్ట్ రైల్వే), రాంచీ, టాటానగర్ (సౌత్ ఈస్ట్రన్ రైల్వే) ప్రయాగరాజ్, కాన్పూర్ (నార్త్ సెంట్రల్ రైల్వే), బిలాస్‌పూర్, రాయపూర్, భోపాల్, కోటకు నడుపుతారు.


సూరత్-కోల్‌కతా ప్రత్యేక రైళ్లు

వెస్ట్రన్ రైల్వే సూరత్ సహా పలు గమ్యస్థానాలకు 24 రైళ్లను నడుపనుండటంతో గుజరాత్‌కు వెళ్లే ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఈస్ట్రన్ రైల్వే కోల్‌కతా, సీల్డా, హౌరా మధ్య 24 రైళ్లను 198 ట్రిప్పులు నడుపనుంది.


మరిన్ని రైళ్లకు అవకాశం

కాగా, ఇది మొదటి విడత ప్రకటన అని ఇండియన్ రైల్వేస్ వివరణ ఇచ్చింది. గతంలో పండుగ సీజన్లలో డిమాండ్‌కు అనుగుణంగా 12,000కు పైగా ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈ క్రమంలో రాబోయే వారాల్లో మరిన్ని రైళ్లను నడిపే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఈస్ట్ సెంట్రల్ రూట్లలో ప్రయాణికుల రద్దీ భారీగా అంచనా వేస్తున్నారు. రాబోయే దీపావళి, ఛాత్ పూజ, దుర్గాపూజ పండుగలను ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఇండియన్ రైల్వే తగిన ఏర్పాట్లు చేస్తోంది.


ఇవి కూడా చదవండి..

మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌ఖడ్

చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 30 , 2025 | 05:13 PM