Jagdeep Dhankar: మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్న జగదీప్ ధన్‌ఖడ్
ABN , Publish Date - Aug 30 , 2025 | 04:00 PM
ఆరోగ్య కారణాల రీత్యా ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్ ధ్రువీకరించింది.
న్యూఢిల్లీ: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) తాజాగా మాజీ ఎమ్మెల్యే పెన్షన్ కోసం రాజస్థాన్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి దరఖాస్తు చేసుకున్నారు. ధన్‌ఖడ్ 1993 నుంచి 1998 వరకూ కిషన్‌గఢ్ అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
పదవీ కాలం కంటే ముందుగానే ఆరోగ్య కారణాల రీత్యా ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ ఇటీవల రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే ఆయన మాజీ ఎమ్మెల్యే పెన్షన్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు రాజస్థాన్ అసెంబ్లీ సెక్రటేరియట్ ధ్రువీకరించింది. ఈ దరఖాస్తును ఆమోదించే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.
సుదీర్ఘ రాజకీయ ప్రయాణం
జగదీప్ ధన్‌ఖడ్ సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగించారు. జనతాదళ్ టిక్కెట్టుపై 1989లో ఝంఝును లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1993లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిషన్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నుంచి 2019 వరకూ పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా పనిచేశారు. 2022 నుంచి 2025 వరకూ ఉపరాష్ట్రపతి బాధ్యతలు నిర్వహించారు.
పెన్షన్ స్కీమ్
రాజస్థాన్ ప్రభుత్వ పెన్షన్ స్కీమ్ ప్రకారం, మాజీ ఎమ్మెల్యేలకు వారి పదవీకాలం ఆధారంగా పెన్షన్లు, ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. ధన్‌ఖఢ్‌కు రూ.42,000 వరకూ నెలవారీ పెన్షన్ రావచ్చని తెలుస్తోంది. అదనంగా ఉచిత వైద్య సౌకర్యం, ప్రయాణ అలవెన్సులు, అసెంబ్లీ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు వీలు కల్పిస్తారు. ఇతర అడ్మినిస్ట్రేటివ్ సౌకర్యాలు కూడా ఉంటాయి.
ఇవి కూడా చదవండి..
చొరబాట్ల స్పెషలిస్ట్ బాగూఖాన్ ఖేల్ ఖతం.. ఎన్‌కౌంటర్‌లో హతం
శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి