India Pakistan Ceasefire: సీజ్‌ఫైర్‌పై భారత ఆర్మీ సంచలన ప్రకటన.. ఏం చెప్పిందంటే..
ABN , Publish Date - May 18 , 2025 | 10:05 AM
కాల్పుల విరమణ ఒప్పందంపై భారత ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. నో డెడ్‌లైన్ అంటూ క్లారిటీ ఇచ్చింది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం..
న్యూఢిల్లీ, మే 18: భారత్-పాకిస్థాన్ మధ్య తాత్కాలికంగా పాటిస్తున్న కాల్పుల విరమణపై మన ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. సీజ్‌ఫైర్‌కు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఆదివారం నాడు జరగాల్సిన డీజీఎంవో చర్చల మీదా క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు ఎలాంటి చర్చలు లేవని తెలిపింది. మే 12వ తేదీన జరిగిన డీజీఎంవోల చర్చల్లో భాగంగా కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. దీనికి ఎటువంటి గడువు లేదని స్పష్టం చేశారు.
నో డిస్కషన్స్
ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న న్యూస్‌ను కేంద్ర రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. సీజ్‌ఫైర్ అవగాహనకు డెడ్‌లైన్ లేదని తెలిపాయి. ఈ నెల 10వ తేదీన ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే ఇంకా కొనసాగుతుందని రక్షణ శాఖ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. పదో తేదీన జరిగిన డీజీఎంవో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి కాలపరిమితి లేదని పేర్కొన్నాయి. ఇవాళ ఇరు దేశాల డీజీఎంవో స్థాయిలో ఎలాంటి చర్చలు లేవని రక్షణ శాఖ వర్గాలు వివరించాయి.
ఇవీ చదవండి:
నీట్ ఫలితాల విడుదలపై మద్రాస్ హైకోర్టు స్టే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి