Pakistan Peace Delegation: భారత్‌ను కాపీ కొడుతున్న పాక్.. తప్పుడు ప్రచారాలకు తెర..
ABN , Publish Date - May 18 , 2025 | 10:43 AM
Pakistan Peace Delegation: పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు పాకిస్తాన్ ప్రతీ విషయంలో భారత్‌కు పోటీ రావాలని చూస్తోంది. ఉగ్రవాదానికి సపోర్టు చేస్తూ ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు పోగొట్టుకుంది. అయినా సిగ్గు లేకుండా శాంతి ప్రచారానికి సిద్ధమైంది.
పాకిస్తాన్ (Pakistan) అరాచకాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి భారత్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షానికి చెందిన నాయకులతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడు బృందాలు(Indian delegations) ఎంపిక చేసిన దేశాల్లో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహకరించటం గురించి వివరించి చెప్పనున్నాయి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఈ విషయంలోనూ పాక్.. భారత్‌కు పోటీ రావాలని చూస్తోంది. భారత ప్రతినిధుల బృందం.. పాకిస్తాన్ ఉగ్రవాదులకు సాయం చేయడంపై.. ఉగ్రవాదంపై భారత్ విధానాలను ప్రచారం చేయడానికి వెళుతుంటే.. పాక్ మాత్రం.. తాము శాంతికి పెద్ద పీట వేశామని చెప్పడానికి సిద్ధమైంది.
ఈ మేరకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ విషయంపై మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్దారీని పిలిపించారు. పాకిస్తాన్ శాంతి కోసం పరితపిస్తోందంటూ ప్రపంచ దేశాలకు వివరించాలని బుట్టోకు చెప్పారు. బుట్టో ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ ఈ రోజు ఉదయం ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ నన్ను పిలిపించారు. పాక్ శాంతి కోసం పరితపిస్తున్న విధానాన్ని అంతర్జాతీయ వేదికలపై వివరించాలని చెప్పారు. ఆ బాధ్యతను తీసుకోవడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
Sai Rajeshs Film: సాయి రాజేష్‌కు షాకిచ్చిన బాబిల్.. బేబీ రీమేక్‌నుంచి ఔట్..
Tragedy After Marriage: కొత్త జీవితం ఇంత విషాదంగా ముగుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు..