Karnataka: పెళ్లి పీటలపై వరుడి మృతి
ABN , Publish Date - May 18 , 2025 | 05:39 AM
కర్ణాటక బాగల్‌కోటె జిల్లాలో పెళ్లి తంతు ముగిసిన 20 నిమిషాల్లోనే వరుడు ప్రవీణ్ గుండెపోటుతో మృతిచెందాడు. పెళ్లి పీటలపైనే ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్‌లో మునిగిపోయారు.
తాళి కట్టిన కాసేపటికి గుండెపోటు.. కర్ణాటకలో విషాద ఘటన
బెంగళూరు, మే 17(ఆంధ్రజ్యోతి): వధువు మెడలో తాళి కట్టిన 20 నిమిషాలకే, పెళ్లి పీటలపైనే వరుడు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోటె జిల్లా జమఖండి పట్టణంలో శనివారం జరిగింది. జమఖండి తాలూకా కుంబారహళ్లికి చెందిన ప్రవీణ్ కుర్నే(24) వ్యవసాయం చేసేవాడు. ఈ యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి నిశ్చయించారు. రిసెప్షన్ వేడుకలు జమఖండి పట్టణంలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. బంధుమిత్రులంతా సంతోషంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన మండపంలో శనివారం మధ్యాహ్నం 12.15గంటలకు వధువు మెడలో వరుడు తాళికట్టాడు. బంధుమిత్రులు వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి పీటలపైనే మరిన్ని ప్రక్రియలు పురోహితులు కొనసాగిస్తుండగా, వరుడు ప్రవీణ్ తన తండ్రి శ్రీశైలను దగ్గరకు పిలిచాడు. తనకు తల తిరుగుతోందని చెప్పాడు. తండ్రి నీళ్లు తెప్పించి తాగించేందుకు ప్రయత్నిస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు జరిపిన వైద్యులు, అప్పటికే ప్రవీణ్ గుండెపోటుతో మృతి చెందిన ట్టు నిర్ధారించారు. బంధుమిత్రులంతా దుఃఖంలో మునిగిపోయారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..