Share News

NEET: నీట్‌ ఫలితాల విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

ABN , Publish Date - May 18 , 2025 | 05:53 AM

నీట్‌ 2025 ఫలితాల విడుదలపై మద్రాసు హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. విద్యుత్ సరఫరా లోపం కారణంగా పరీక్షలలో ఇబ్బంది పడ్డ విద్యార్థుల పిటిషన్లను హైకోర్టు పరిగణించింది.

NEET: నీట్‌ ఫలితాల విడుదలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

చెన్నై, మే 17(ఆంధ్రజ్యోతి): నీట్‌ ఫలితాల విడుదలపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర యూజీ వైద్య కోర్సులకు మే 4న నీట్‌ను నిర్వహించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందిపడిన తమకు మళ్లీ పరీక్ష నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ తిరువళ్లూర్‌, రాణిపేట జిల్లాలకు చెందిన 13మంది విద్యార్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలను విచారించిన మద్రాసు హైకోర్టు... ఫలితాల విడుదలపై స్టే విధించింది.


ఇవి కూడా చదవండి..

Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 18 , 2025 | 05:53 AM