Share News

India React On Trump Tariff: ట్రంప్ టారిఫ్‌లపై భారత్ స్పందన..

ABN , Publish Date - Aug 06 , 2025 | 09:23 PM

రష్యా చమురు దిగుమతిని కొనసాగించడానికి ప్రతిస్పందనగా అదనపు సుంకాలను విధించాలనే అమెరికా నిర్ణయాన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ చర్య అన్యాయం, అసమంజసమైనదని అభివర్ణించింది.

India React On Trump Tariff: ట్రంప్ టారిఫ్‌లపై భారత్ స్పందన..
India React On Trump Tariff

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వక్రబుద్ధితో భారత్‌పై మరోసారి అధిక సుంకాల విధించిన సంగతి తెలిసిందే.భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను ఆయన విధించారు. అయితే ట్రాంప్ విధిస్తున్న అధిక సుంకాలపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. అమెరికా నిర్ణయాన్ని ఖండించింది.


రష్యా చమురు దిగుమతిని కొనసాగించడానికి ప్రతిస్పందనగా అదనపు సుంకాలను విధించాలనే అమెరికా నిర్ణయాన్ని భారతదేశం తీవ్రంగా ఖండించింది. ఈ చర్య అన్యాయం, అసమంజసమైనదని అభివర్ణించింది. త్వరలోనే.. అమెరికా చర్యలకు ధీటుగా భారత్ జవాబిస్తుందని పేర్కొంది..


భారతదేశం ఇటీవల రష్యా నుండి భారతదేశం చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ అంశంపై భారత్ తన వైఖరిని అమెరికాకు స్పష్టంగా చెప్పినప్పటికీ, భారతదేశం చమురు దిగుమతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమని అభిప్రాయపడింది.


భారత్‌పై 25 శాతం అదనపు టారిఫ్‌లను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను 25 శాతం మేర భారత్‌పై ఆయన టారిఫ్‌ను విధించారు. దీంతో భారత్‌పై మొత్తం 50 శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Updated Date - Aug 06 , 2025 | 09:30 PM