India-Pakistan: పాక్‌తో ఉద్రిక్తతలు.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచన..
ABN , Publish Date - May 05 , 2025 | 07:29 PM
India-Pakistan Tensions: సరిహద్దుల వద్ద దాయాది దేశంతో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు కీలక సూచన జారీ చేసింది. మే 7 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాలు పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని ఆదేశించింది. యుద్ధం ఏ క్షణంలోనైనా ముంచుకు రావచ్చనేందుకు ఈ ప్రకటనే నిదర్శనమని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Home Ministry Emergency Mock Drill: పాకిస్తాన్‌తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశంలోని అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రు దాడి జరిగినప్పుడు సంసిద్ధంగా ఉండేందుకు మే 7 నుంచి పౌర రక్షణ మాక్ డ్రిల్‌లు నిర్వహించాలని సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మాక్ డ్రిల్ ద్వారా వైమానిక దాడుల సైరన్‌లను పరీక్షించడం, పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, బ్లాక్అవుట్ చర్యలను అమలు చేయడం వంటి మొదలైన కీలక కార్యకలాపాలు నిర్వహిస్తారు.
దాయాది దేశంతో ఉద్రిక్తలు పెరుగుతుండటంతో దేశంలో వైమానిక దాడులపై అవగాహన పెంచేందుకు మాక్ డ్రిల్ నిర్వహించాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఉన్న స్థానిక అధికారులు, విద్యా సంస్థలు, పౌరులకు ఎమర్జెన్సీ వేళల్లో ఎలా స్పందించాలో అవగాహన కల్పించాలని నొక్కి చెప్పింది. శత్రుదేశాలు దాడి చేస్తే ఎలా స్పందించాలి.. అత్యవసర పరిస్థితుల్లో తమను తాము ఎలా కాపాడుకోవాలో మాక్ డ్రిల్ ద్వారా ప్రజలకు శిక్షణ ఇస్తారు. క్రాష్ బ్లాక్అవుట్ చర్యలు కూడా ఉంటాయి.
Read Also: Rahul meets PM Modi : ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్ గాంధీ భేటీ
Sonu Nigam: పహల్గాం ఘటనపై సోనూ నిగమ్ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..
India vs Pakistan Missile Power: భారత్‌తో పోలిస్తే పాక్ క్షిపణుల సామర్థ్యం ఎంతంటే..