Share News

India Missile Attacks: పాక్‌పై భారత్ దాడి.. 3 ఎయిర్‌బేస్‌లు మటాష్..

ABN , Publish Date - May 10 , 2025 | 09:51 AM

Pakistan Airbases: ఆపరేషన్ సిందూర్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్న పాకిస్థాన్‌కు చుక్కలు చూపిస్తోంది భారత ఆర్మీ. ప్రత్యర్థి దాడుల్ని తిప్పికొట్టడమే గాక ఎదురుదాడులకు దిగుతూ వణికిస్తోంది.

India Missile Attacks: పాక్‌పై భారత్ దాడి.. 3 ఎయిర్‌బేస్‌లు మటాష్..
India Missile Attack

ఆపరేషన్ సిందూర్‌తో వణుకుతున్న పాకిస్థాన్‌కు అస్సలు నిద్రపట్టడం లేదు. భారత్ మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని శత్రుదేశం భావిస్తోంది. అందుకే రాత్రుళ్లు మన దేశం మీదకు దాడులకు తెగబడుతోంది. డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. అయితే వాటిని సమర్థంగా తిప్పికొడుతున్న భారత సైన్యం.. ఊహించని రీతిలో ఎదురుదాడులతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. శనివారం తెల్లవారుజామున పాక్‌పై భారత్ మెరుపు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఏకంగా అక్కడి 4 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేశారని సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..


టార్గెట్ చేసి మరీ..

రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు మురిద్, రఫీకీతో పాటు మరో ఎయిర్‌బేస్‌‌ను భారత దళాలు మిసైల్స్‌తో పేల్చేసినట్లు తెలుస్తోంది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ నుంచి భారీ ఎత్తున మంటలు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పాక్ స్థానిక మీడియా కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఫొటోలు, వీడియోలను టెలికాస్ట్ చేస్తోంది. మిసైళ్ల ధాటికి ఈ ఎయిర్‌బేస్‌ ధ్వంసమైందని, భారీ ఎత్తున పేలుళ్లు సంభవించాయని అక్కడి మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నూర్ ఖాన్‌తో పాటు మురిద్, రఫీకీ ఎయిర్‌బేస్‌ను కూడా భారత్ పక్కా ప్లాన్ చేసి మరీ పేల్చేసిందని సమాచారం. ఈ దాడి తర్వాతే పాక్ తమ గగనతలాన్ని మూసేసిందని తెలుస్తోంది. కాగా, ఎయిర్‌స్పేస్‌ను మూసేసి ఇండియా అటాక్స్‌ను అడ్డుకోవాలని పాక్ చూస్తున్నట్లు కనిపిస్తోంది. గగనతలాన్ని మూసేయడం వల్ల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు ఇలా ఏది కనిపించినా పేల్చేయాలని పథకం రచించినట్లు సమాచారం.


ఇవీ చదవండి:

పాక్ ఎయిర్‌స్పేస్‌‌ బంద్

తుస్సుమంటున్న పాక్ మిస్సైల్స్

సైన్యం కదలికలపై ప్రత్యక్ష ప్రసారాలొద్దు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 09:58 AM