Teacher Drunk Driving: మద్యం మత్తులో టీచర్ దారుణం.. కారుతో 1.5 కి.మీ బైక్‌ను ఈడ్చుకెళ్లి..!
ABN , Publish Date - Oct 30 , 2025 | 01:42 PM
గుజరాత్ రాష్ట్రంలో ఓ టీచర్ మద్యం మత్తులో రచ్చ చేశాడు. రోడ్డుపై ఓ బైక్ ను ఢీ కొట్టి.. 1.5 కిలో మీటర్ల పైనే ఈడ్చుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో కారు బానెట్ పై బైకర్ ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
గుజరాత్, అక్టోబర్ 30: నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. మద్యం మత్తులో డ్రైవ్ చేయడం కూడా ఈ ప్రమాదాలకు ఓ కారణం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని ప్రభుత్వాలు, పోలీసులు విజ్ఞప్తి చేసినా, కఠిన నిబంధనలు విధించిన కొందరు మారడం లేదు. మద్యం తాగి డ్రైవ్ చేసే వారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రం(Gujarat Road Accident)లో ఓ టీచర్ మద్యం మత్తులో రచ్చ చేశాడు. రోడ్డుపై ఓ బైక్ ను ఢీ కొట్టి.. 1.5 కిలో మీటర్ పైనే ఈడ్చుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో కారు బానెట్ పై బైకర్ ఉన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గుజరాత్ రాష్ట్రం, మహిసాగర్ జిల్లా లునావాడ సమీపంలోని నేషనల్ హైవే 48పైన టీచర్ మద్యం మత్తు(Drunk Driving)లో బైక్ ను ఢీ కొట్టాడు. ప్రమాదం జరిగిన సమయంలో టీచర్ తో పాటు అతని సోదరుడు మద్యం మత్తులో ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన 33 సెకన్ల వీడియో(Viral Video Accident)ను చూస్తే ఒళ్ళు జలదరిస్తుంది. కారు ముందు ఇరుక్కుపోయిన బైక్‌ను అలాగే ఈడ్చుకుంటూ వెళ్తున్నట్లు(Bike Dragging Incident) వీడియోలో కనిపిస్తుంది. చివరికి బైక్ పైన ఉన్న ఇద్దరిలో ఒకరు కింద పడిపోతారు. అతని చేయిపై నుంచి కారు చక్రాలు వెళ్లాయి.
వీడియోను ఇక్కడ చూడండి..
ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు(Police Investigation) చేస్తున్నామని మహిసాగర్ జిల్లా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమలేష్ తెలిపారు. నిందితులు మనీష్ పటేల్, మెహుల్ పటేల్‌గా పోలీసులు గుర్తించారు. అలానే బాధితులను దినేష్‌భాయ్ (50), సునీల్(21)గా గుర్తించారు. మద్యం మత్తు(Drunk Driving)లో కారును డ్రైవ్ చేసిన సదరు ఉపాధ్యాయుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే ప్రయత్నంలో ఉన్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు లునావాడ సివిల్ హాస్పిటల్, గోద్రా సివిల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు టీచర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Australian cricketer: విషాదం.. ఆసీస్ యువ క్రికెటర్ మృతి
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు