Share News

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:22 PM

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు.

Chennai News: రాష్ట్రంలో 2026 ఎన్నికల తర్వాత బీజేపీ అదృశ్యం..

- మంత్రి రఘుపతి జోస్యం

చెన్నై: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీ అదృశ్యమవుతుందని, డీఎంకే మళ్లీ అధికారం చేపడుతుందని మంత్రి రఘుపతి(Minister Raghupathi) జోస్యం చెప్పారు. పుదుకోటలో గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఎస్‌ఐఆర్‌పై నవంబరు 2వ తేది అఖిలపక్ష సమావేశం తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారన్నారు. మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించేలా ఎన్నికల సంఘాన్ని బీజేపీ(BJP) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని ఆరోపించారు. బిహార్‌లోను ఇలాంటి ప్రయత్నం జరిగిందన్నారు. అలాంటి చర్యలను డీఎంకే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.


nani6.2.jpg

రాష్ట్రానికి ఉపాధి కోసం వచ్చే ఉత్తరాది కార్మికుల సంఖ్య లక్షల నుంచి కోటికి చేరిందన్నారు. తమిళనాడు(Tamil Nadu) అంటే తెలియనివారు, ఒకే ప్రాంతంలో శాశ్వతంగా ఉండనివారని రాష్ట్ర ఓటర్ల జాబితాలో చేర్చరాదని తాము డిమాండ్‌ చేస్తున్నామన్నారు. డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్‌ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. డీఎంకేను ప్రజలు ఆదరిస్తున్నారని, వారి ఆదరణతో రాబోయే ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మళ్లీ సీఎం స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే 2.0 ప్రభుత్వం ఏర్పాటవుతోందని మంత్రి తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2025 | 01:22 PM