Share News

AP Cabinet Postponed: ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:15 PM

ఏపీ కేబినెట్‌ సమావేశాన్ని నవంబర్ 10వ తేదీకి వాయిదా వేస్తూ సీఎస్‌ కార్యాలయం నోట్‌ విడుదల చేసింది.

AP Cabinet Postponed: ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా.. ఎప్పుడంటే..?
AP cabinet meeting

అమరావతి: నవంబర్ 7న జరగాల్సిన ఏపీ కేబినెట్‌ సమావేశం వాయిదా పడింది. కేబినెట్‌ భేటీని నవంబర్ 10వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 10వ తేదీకి కేబినెట్‌ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్‌ కార్యాలయం నోట్‌ విడుదల చేసింది. మంత్రివర్గ సమావేశం నిర్వహణకు సంబంధించిన మార్పులను గమనించాల్సిందిగా అన్ని శాఖల కార్యదర్శులకు సూచనలు చేసింది.


అయితే.. విశాఖ వేదికగా జరిగే పెట్టుబడుల సదస్సుపై మంత్రి వర్గం చర్చించనుంది. మంత్రులు అందరికీ సదస్సు నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లపై మంత్రి వర్గ ఉప సంఘం నియామకమైన విషయం తెలిసిందే. దీంతో పాటు రాజధాని అమరావతి పనులు, భూముల కేటాయింపులపై కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే.. శాంతి భద్రతల అంశంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా.. కేబినెట్ భేటీని వాయిదా వేసినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

Home Minister Amit Shah: పీఎం, సీఎం..రెండు పదవులూ ఖాళీ లేవు

Former Bangladesh PM Sheikh Hasina: భారత్‌లో స్వేచ్ఛగా ఉన్న..బంగ్లాదేశ్‌కు వెళ్లే ఉద్దేశం లేదు

Updated Date - Oct 30 , 2025 | 01:33 PM