Share News

Delhi Assembly Elections: కమలం గూటికి చేరిన 8 మంది ఆప్ మాజీ ఎమ్మెల్యేలు

ABN , Publish Date - Feb 01 , 2025 | 07:10 PM

ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పార్టీ టిక్కెట్ దక్కలేదు.

Delhi Assembly Elections: కమలం గూటికి చేరిన 8 మంది ఆప్ మాజీ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గట్టిదెబ్బ పడింది. ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేసిన 8 మంది ఎమ్మెల్యేలు శనివారంనాడు బీజేపీ (BJP)లో చేరారు. వీరితో పాటు పలువురు కౌన్సిలర్లు సైతం బీజేపీ కండువా కప్పుకున్నారు.

Rahul Gandhi: బుల్లెట్ గాయానికి బ్యాండ్ఎయిడ్.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విసుర్లు


బీజేపీలో చేరిన ఆప్ మాజీ ఎమ్మెల్యేలలో భావన కౌర్ రెండు సార్లు పాలమ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, మదన్‌లాల్ మూడుసార్లు కస్తూర్బా నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గిరిష్ సోని మూడుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యే కాగా, రాజేష్ రిషి రెండుసార్లు ఎన్నికయ్యారు. వీరితో పాటు నరేష్ యాదవ్, పవన్ శర్మ, బీఎస్ జూన్, రోహిత్ మెహ్రోలియా, బిజేంద్ర గార్గ్ బీజేపీలో చేరారు. ఆప్ కౌన్సిలర్ జయ్ రాయ్ సైతం కమలం గూటికి చేరారు.


ఆప్ సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిందని, అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపిస్తూ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి శుక్రవారం రాజీనామా చేశారు. ఈ ఎనిమిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి పార్టీ టిక్కెట్ దక్కలేదు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామ చేసిన ఎమ్మెల్యేలంతా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ బీజేపీ ఇన్‌చార్జి బైజంయత్ పాండ, ఢిల్లీ బీజేపీ విభాగం అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సమక్షంలో ఆ పార్టీలోకి చేరారు. పార్టీలో చేరిన నేతలకు పాండ స్వాగతం పలికారు. అప్‌దా నుంచి నేతలు విముక్తి పొందడం చారిత్రకమని, ఢిల్లీ 5న జరిగే ఎన్నికలతో ఆప్‌దా నుంచి ఢిల్లీ సైతం విముక్తి పొందుతుందని పాండ అన్నారు. 70 మంది సభ్యుల ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న కౌంటింగ్ జరుగుతుంది.


Budget 2025: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం.. ముఖ్యాంశాలు ఇవే

Artificial Intelligence: బడ్జెట్‌లో AIకి ప్రాధాన్యత.. రూ. 500 కోట్ల కేటాయింపు..

Union Budget For Start-Ups: బడ్జెట్‌లో స్టార్టప్‌లకు సూపర్ న్యూస్.. లక్షల వర్షం

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 01 , 2025 | 07:10 PM