Share News

Bihar Elections: 71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల

ABN , Publish Date - Oct 14 , 2025 | 03:33 PM

తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.

Bihar Elections: 71 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల
Bihar Assembly Elections

పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేడి ఊపందుకుంటోంది. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. భారతీయ జనాతా పార్టీ (BJP) 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను మంగళవారంనాడు ప్రకటించింది. ఈ జాబితాలో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా పేర్లు చోటుచేసుకున్నాయి. ఎన్డీయే కూటమిలో భాగంగా 101 స్థానాల్లో బీజేపీ ఈసారి పోటీ చేస్తోంది.


తారాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సామ్రాట్ చౌదరి పోటీ చేయనుండగా, లఖిసరాయ్ నుంచి విజయ్ సిన్హా పోటీ చేయనున్నారు. లఖిసరాయ్ నియోజకవర్గానికి నాలుగుసార్లు విజయ్ సిన్హా ప్రాతినిధ్యం వహించారు. 2005, 2010, 2015, 2020లో ఆయన వరుసగా గెలుస్తూ వచ్చారు.


కాగా, టెక్కెట్లు దక్కిన ఇతర ప్రముఖుల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి రేణు దేవి (బెట్టియా), తారాకిషోర్ ప్రసాద్ (కతిహార్), మంగళ్ పాండే (సివన్), నితీష్ మిశ్రా (ఝాన్జార్పూర్), నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ (చతర్పూర్), విజయ్ కుమార్ మండల్ (సిక్తి), సంజయ్ సరావుగి (దర్బంగా), రాణా రణ్‌ధీర్ సింగ్ (మధుబన్)స సునీల్ కుమార్ పింటు (సీతామర్హి), నితిన్ నబిన్ (బంకీపూర్), డాక్టర్ ప్రేమ్ కుమార్ (గయ టౌన్), సిద్దార్ధ్ సౌరవ్ (బిక్రం) ఉన్నారు. రేణుదేవితో పాటు 8 మంది మహిళా అభ్యురులకు కూడా టిక్కెట్లు దక్కాయి. శ్రేయాసి సింగ్ (జముయి), అరుణా దేవి (వర్సాలిగంజ్), రామ నిషద్ (ఆరైయ), నిషా సింగ్ (ప్రాణ్‌పూర్), కవిత దేవి (కొర్హా), స్వీటీ సింగ్ (కృష్ణ గంజ్), దేవాంతి యాదవ్ (నర్పట్‌గంజ్), గాయత్రి దేవి (పరిహార్) ఈ జాబితాలో ఉన్నారు. బిహార్ అసెంబ్లీ స్పీకర్ నంద్ కిషోర్ యాదవ్‌కు ఈ సారి టిక్కెట్ దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పాటలీపుత్ర నియోజకవర్గం నుంచి ఓటమి చవిచూసిన కేంద్ర మాజీ మంత్రి రామ్ కృపాల్ యాదవ్‌కు దానాపూర్‌ నుంచి టిక్కెట్ దక్కింది.


ఇవి కూడా చదవండి..

ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై నిష్పాక్షిక విచారణ జరపాలి.. రాహుల్ డిమాండ్

తేల్చేసిన మాజీసీఎం.. విజయ్‌ పార్టీతో పొత్తు

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 03:56 PM