Share News

Assembly Elections: టీవీకేతో అన్ని పార్టీలకూ నష్టమే...

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:00 AM

అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు.

Assembly Elections: టీవీకేతో అన్ని పార్టీలకూ నష్టమే...

చెన్నై: అన్ని పార్టీల ఓట్లను తమిళగ వెట్రి కళగం (టీవీకే) తప్పకుండా చీలుస్తుందని, ఇందువల్ల కూటమికి నష్టంవాటిల్లకుండా అధికార డీఎంకే చర్యలు తీసుకోవాలని కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి (కేఎండీకే) ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ఈశ్వరన్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆయన కోవైలో సోమవారం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హైలెవల్‌ కమిటీ సమావేశంలో కోవై, ఈరోడ్‌ తదితర కొంగునాడు జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఈశ్వరన్‌ మీడియాతో మాట్లాడుతూ..


nani3.2.jpg

గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంగు మండలంలో ఉన్న 39 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 23స్థానాలను అన్నాడీఎంకే(AIADMK) కైవసం చేసుకుందని, ఈ సారి ఆ స్థానాలు కూటమికి దక్కేలా డీఎంకే(DMK) వ్యూహ రచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. సినీ నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావడం వల్ల కొంగు మండలంలో అన్ని పార్టీల ఓటు బ్యాంకు చీలుతుందని, తాను ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తిరుచెంగోడులో పూర్తిచేసిన అభివృద్ధి పనులే తనను మళ్లీ గెలిపిస్తాయని ఈశ్వరన్‌ నమ్మకం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దేవుడా.. చుక్కలనంటుతున్న పసిడి ధరలు

వెంకటేష్‌ నాయుడి ఫోన్‌ అన్‌లాక్‌కు అనుమతి

Read Latest Telangana News and National News

Updated Date - Oct 14 , 2025 | 11:01 AM