BJP, Congress Worker Clash: మోదీ తల్లిపై వ్యాఖ్యలు.. జెండా కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
ABN , Publish Date - Aug 29 , 2025 | 02:42 PM
ప్రధానమంత్రి తల్లిని అవమానపరిచిన కాంగ్రెస్‌కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీపై విరుచుకుపడింది. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ చాలా తప్పుచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ అన్నారు.
పాట్నా: బిహార్‌లోని దర్బంగా (Darbanga) లో జరిగిన కాంగ్రెస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం అట్టుడికింది. పాట్నాలోని కాంగ్రెస్ కార్యాలయం వెలుపల బీజేపీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పార్టీ జెండా కర్రాలతో ఉభయ వర్గాలు తలపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
ప్రధానమంత్రి తల్లిని అవమాన పరిచిన కాంగ్రెస్‌కు తాము గట్టి సమాధానం చెబుతామని బీజేపీ నేత నితిన్ నబీన్ తెలిపారు. ఇందుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు. కాంగ్రెస్ సైతం బీజేపీపై విరుచుకుపడింది. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని, నితీష్ చాలా తప్పుచేస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త డాక్టర్ అశుతోష్ అన్నారు.
దర్బంగాలో..
దర్బంగాలో గత బుధవారం నాడు యువజన కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మోదీని, ఆయన తల్లిని అవమానపరిచినట్టు ఆరోపణలు వచ్చాయి. జలేకి చెందిన కాంగ్రెస్ నేత నౌషద్ మహమ్మద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఘటనపై నౌషద్ ఆ తర్వాత క్షమాపణ చెప్పారు. ఘటన జరిగినప్పుడు తాను సమావేశంలో లేనని చెప్పారు. రఫీక్ అలియాస్ రాజా అనే వ్యక్తి ఈ ఆరోపణలు చేసినట్టు బీజేపీ ఫిర్యాదు చేయడంతో దర్బంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. సిమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచినట్టు దర్బంగా పోలీసులు సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
క్షమాపణకు బీజేపీ నేతల డిమాండ్
ఈ ఘటనపై బీజేపీ విరుచుకుపడింది. రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ క్షమాపణ చెప్పాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ దిగజారుడుకు ఇది అద్దం పడుతుందని అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రిపై, మరణించిన ఆయన తల్లిపైన వాడిన భాష గర్హనీయమని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితిష్ కుమార్ ఖండించారు.
ఇవి కూడా చదవండి..
బిహార్‌లో మూడు లక్షల మందికి ఈసీ నోటీసులు..
పాట్నాలో రాహుల్ గాంధీపై కేసు నమోదు..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి