Share News

TVK Party President Vijay: సుప్రీంకోర్టుకు విజయ్ టీవీకే పార్టీ...

ABN , Publish Date - Aug 29 , 2025 | 11:05 AM

తమిళ నటుడు విజయ్‌ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

TVK Party President Vijay: సుప్రీంకోర్టుకు విజయ్ టీవీకే పార్టీ...

తమిళనాడు: తమిళ నటుడు విజయ్‌ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని సుప్రీంలో టీవీకే పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో ఓ దళిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత సాఫ్ట్‌వేర్‌కు న్యాయం జరగాలని కోరుతూ.. పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని టీవీకే ధర్మాసనాన్ని ఆశ్రయించింది.


రాష్ట్రంలో జులై 27న తిరునెల్వేలిలో ఐటీ ఉద్యోగి కవిన్‌ సెల్వగణేషన్‌ హత్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కవిన్‌ వేరొక సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. ఇది నచ్చని ఆమె సోదరుడు సుర్జిత్‌, కవిన్‌ను హత్య చేశాడు. ఈ హత్యకు సంబంధించి సుర్జిత్‌తో పాటు అతడి తండ్రి శరవణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. రాష్ట్రంలోని పలు పార్టీలు ఈ పరువు హత్యలకు సంబంధించి ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరాయి. ఎంతకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో టీవీకే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..

4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 29 , 2025 | 11:09 AM