Bihar Elections: బిహార్ ఎన్నికలు.. రాహుల్ మరో సంచలన నిర్ణయం
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:47 PM
ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో అధికారం చేపడితే.. ఢిల్లీ పీఠాన్ని సులువుగా హస్తగతం చేసుకోవచ్చనే ఒక ప్రచారం చాలా కాలంగా ఉంది. మరి కొద్ది నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలంటూ కాంగ్రెస్, బీజేపీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. దీంతో బిహార్ కేంద్రంగా కేంద్రంలోని మోదీ సర్కార్ కోట్లాది రూపాయిల విలువైన పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చూట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సైతం తనదైన శైలిలో ముందుకు వెళ్తోంది. ఆ క్రమంలో బిహార్ రాజధాని పాట్నా వేదికగా సెప్టెంబర్ 24వ తేదీన విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీతోపాటు ఆ పార్టీ భాగస్వామ్య పక్షాలకు చెందిన నేతలు, కార్యకర్తలు శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం నెలకొల్పేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ సీడబ్ల్యూసీ సమావేశం వేదికగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విస్తృత సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీఎల్పీ నేతలతోపాటు పీసీసీ అధ్యక్షులు పాల్గొనున్నారు.
అదీకాక ఈ ఏడాది ఆగస్ట్ 17వ తేదీన ససారంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర సెప్టెంబర్ 1వ తేదీన బిహార్ రాజధాని పాట్నాలో ముగిసింది. దాదాపు 25 జిల్లాల్లో ఈ యాత్ర సాగిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన ఈ యాత్రకు బిహారీ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
దీంతో బిహార్‌లో కాంగ్రెస్ పార్టీకి దూసుకు పోతుందనేందుకు ఈ యాత్రకు జనం నుంచి లభించిన విశేష స్పందనే కారణమనే ఒక చర్చ సైతం కొనసాగుతోంది. మరోవైపు ఏప్రిల్ 17 వ తేదీ పాట్నాలో జరిగిన సమావేశంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం “ఇండియా” కూటమి సమన్వయ కర్తగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్.జే.డి) అగ్రనేత తేజస్వీ యాదవ్ నియామితులైన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది: సీఎం రేవంత్
అణు బెదిరింపులకు భారత్ భయపడదు: ప్రధాని మోదీ
Read Latest National News and Telugu News