India Vs Pakistan: పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌ల విషయంలో భారత్ వైఖరి మారలేదు: అనురాగ్ ఠాకూర్
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:09 PM
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారం నాడు మాట్లాడుతూ చెప్పారు.
న్యూఢిల్లీ: ఆసియా కప్(Asia Cup)లో భాగంగా సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమ్ ఇండియా (Team India) పాకిస్థాన్‌తో తలపడనుండటంపై భారత అభిమానుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై బీజేపీ ఎంపీ, కేంద్ర క్రీడాశాఖ మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) వివరణ ఇచ్చారు. మల్టీనేషనల్ టోర్నమెంట్లలో పాకిస్థాన్‌తో భారత్ తలపడాల్సి వచ్చినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ద్వైపాక్షిక టోర్నమెంట్లు ఆడదని చెప్పారు. ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాల విషయంలో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.
టోర్నమెంట్ నిబంధనల ప్రకారంగానే మల్టీనేషనల్ టోర్నమెంట్లలో భారత్ పార్టిసిపేషన్ ఉంటుందని, అంతమాత్రాన దౌత్య, జాతీయ విధానాలను ఇండియా మార్చుకున్నట్టు కాదని అనురాగ్ ఠాకూర్ మీడియాతో శనివారం నాడు మాట్లాడుతూ చెప్పారు. 'మల్టీనేషనల్ టోర్నమెంట్లను ఏసీసీ కానీ ఐసీసీ కానీ నిర్వహించినప్పుడు ఆయా దేశాలు అందులో పాల్గొనడం తప్పనిసరి. అలా చేయకుంటే ఆ దేశాలను టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ చేస్తారు. అలాగే ప్రత్యర్థి జట్లకు పాయింట్లు జోడిస్తారు. అయితే పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొనరాదని భారత్ చిరకాలంగా అనుసరిస్తున్న వైఖరికి కట్టుబడి ఉన్నాం' అని చెప్పారు.
భారత్‌పై ఉగ్రదాడులు ఆపేంతవరకూ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ అడరాదనే నిర్ణయం చాలాకాలం క్రితమే తీసున్నట్టు అనురూగ్ ఠాకూర్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌తో ఇండియా మ్యాచ్‌ను రద్దు చేయాలని విపక్ష ఏఐఎంఐఎం, శివసేన (యూబీటీ) తదితర పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఠాకూర్ వివరణ ప్రాధాన్యత సంతరించుకుంది.
రక్తం-కిక్రెట్ కలిసి ప్రవహించవు
భారత్-పాక్ మ్యాచ్‌పై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, ఆదివారం జరిగే మ్యాచ్‌కు వ్యతిరేకంగా తమ పార్టీ నిరసన తెలుపుతుందని చెప్పారు. 'రక్తం-క్రికెట్ కలిసి ప్రవహించవు' అని అన్నారు. పాక్‌తో భారత్ మ్యాచ్‌పై మహారాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. ఇది పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లను అవమానించడమే అవుతుందని పేర్కొంది. మ్యాచ్‌కు అనుమతించడం కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతుందని ఎన్‌సీపీ(ఎస్‌పీ) చీఫ్ శరద్ పవార్ వ్యాఖ్యానించారు. ఇండియా-పాక్ మధ్య దుబాయ్‌లో సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్‌పై తాత్కాలిక స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు గత గురువారం నాడు నిరాకరించింది.
ఇవి కూడా చదవండి
మణిపూర్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకువస్తాం.. మోదీ భరోసా
బైరబీ-సైరాంగ్ రైల్వే లైన్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాని
For More National News and Telugu News