Share News

Breaking News: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్‌ రెడ్డి సస్పెన్షన్‌

ABN , First Publish Date - Mar 13 , 2025 | 10:33 AM

Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్‌ రెడ్డి సస్పెన్షన్‌
Telangana Assembly Budget Session 2025

Live News & Update

  • 2025-03-13T16:12:05+05:30

    ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటిది అసెంబ్లీ: భట్టి విక్రమార్క

    • సభా మర్యాదను కాపాడుకోవడం అందరి బాధ్యత.

    • జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యాలు చాలా బాధాకరం.

    • గవర్నర్‌, స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడారు.

    • స్పీకర్‌ చైర్‌ను అందరూ గౌరవించాల్సిందే.

    • ఉన్నతమైన సభలో స్పీకర్‌ను అవమానించడం హేయం.

    • గవర్నర్‌ను కూడా బీఆర్ఎస్ సభ్యులు అవమానించారు.

    • సభలో బీఆర్ఎస్ సభ్యుల తీరు అత్యంత బాధాకరం.

    • సభ మీ సొంతం కాదంటూ మాట్లాడటమేంటి?

    • కొన్ని వర్గాలంటే బీఆర్ఎస్‌కు గిట్టదు.

    • బీఆర్ఎస్ సభ్యుల వ్యవహారశైలి దురదృష్టకరం.

    • మీకు కేసీఆర్‌ నేర్పింది ఇదేనా?

    • జగదీష్‌రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్‌ కమిటీకి పంపాలి.

    • జగదీష్‌రెడ్డిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలి.

  • 2025-03-13T16:09:44+05:30

    స్పీకర్‌ను విమర్శించే హక్కు ఎవరికీ లేదు: ఉత్తమ్‌

    • అసెంబ్లీ BRS సభ్యుల తీరు దురదృష్టకరం.

    • స్పీకర్‌ను అవమానించడం సహించరానిది.

    • జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే.

    • ఏకవచనంతో స్పీకర్‌నుద్దేశించి మాట్లాడటం హేయం.

  • 2025-03-13T16:07:55+05:30

    జగదీష్‌రెడ్డి తీరు అత్యంత జుగుప్సాకరం: మంత్రి సీతక్క

    • స్పీకర్‌ను అవమానించడం సరికాదు.

    • స్పీకర్‌ అంటే పదవి మాత్రమే కాదు.. ఒక వ్యవస్థ.

    • జగదీష్‌రెడ్డి వ్యాఖ్యల వీడియో సభ ఎదుట పెడతాం.

    • కాంగ్రెస్‌ కార్యకర్త అంటూ.. గవర్నర్‌ను కూడా BRS సభ్యులు అవమానించారు.

    • స్పీకర్‌ను టార్గెట్‌ చేయడం అత్యంత బాధాకరం.

    • జగదీష్‌రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలి.

  • 2025-03-13T16:07:06+05:30

    స్పీకర్‌ను జగదీష్‌రెడ్డి అవమానించారు: వేముల వీరేశం

    • జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే.

    • దళితులంటే బీఆర్‌ఎస్‌కు చిన్నచూపు.

    • స్పీకర్‌ను అవమానించిన జగదీష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.

    • చైర్‌ను ప్రశ్నించడాన్ని తెలంగాణ సమాజం బాధపడుతుంది.

    • బలహీన వర్గాలకు పెద్ద స్థానం కల్పిస్తే గర్వపడ్డాం.

    • ఏక వాక్యంతో చైర్‌ను ప్రశ్నించడం దురదృష్టం.

    • దళిత స్పీకర్‌ను అవమానించినట్లు భావిస్తున్నాం.

    • అవమానించిన సభ్యుడిపై చర్యలు తీసుకోవాలి.

  • 2025-03-13T16:05:26+05:30

    తెలంగాణ: వాయిదా అనంతరం తెలంగాణ అసెంబ్లీ తిరిగి ప్రారంభం

    • అసెంబ్లీలో భారీగా మార్షల్స్‌ మోహరింపు

    • జగదీశ్‌ రెడ్డి వ్యాఖ్యలపై అసెంబ్లీలో దుమారం

    • జగదీశ్‌ రెడ్డిపై చర్యలు చేపట్టాలని అధికారపక్షం పట్టు

  • 2025-03-13T16:04:04+05:30

    తెలంగాణ అసెంబ్లీ నుంచి జగదీశ్‌ రెడ్డి సస్పెన్షన్‌

    • ప్రస్తుత సెషన్‌కు సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

    • బడ్జెట్‌ సెషన్‌ ముగిసే వరకు జగదీశ్‌ రెడ్డి సస్పెన్షన్

    • సస్పెండైన సభ్యుడు సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్‌ ఆదేశం

  • 2025-03-13T15:54:18+05:30

    • దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే అహంకారంగా మాట్లాడారు: రామ్ చంద్రు నాయక్

    • సభ్యుని భాష అవమానకరం

    • ఇది తప్పుడు సంకేతాలు ఇస్తుంది

    • గతంలో దళితుడిని సిఎం చేస్తామని చేయలేదు..

    • దళిత డిప్యూటీ సిఎంను బర్త్ రఫ్ చేసి అవమానించారు..

    • దళిత స్పీకర్ ను అవమానించిన సభ్యుని పై చర్యలు తీసుకోవాలి

  • 2025-03-13T14:26:51+05:30

    స్పీకర్‌ను అవమానించలేదు: హరీష్ రావు

    • స్పీకర్‌ను జగదీష్ రెడ్డి అవమానించలేదన్నారు హరీష్ రావు.

    • సభ మీ ఒక్కరిదే కాదు.. అందరిదని జగదీష్ అన్నారని చెప్పుకొచ్చారు.

    • మీ అనే పదం సభా నిబంధనలకు విరుద్ధం ఎలా అవుతుందని హరీష్ ప్రశ్నించారు.

    • మీ ఒక్కరిదే అనే పదం అన్-పార్లమెంటరీ వర్డ్ కాదన్నారు.

    • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకు నిరసన చేశారో తనకు తెలియదన్నారు హరీష్.

    • సభలో జగదీష్ రెడ్డి మాట్లాడిన వీడియో రికార్డు తీయాలని స్పీకర్‌ను కోరామన్నారు.

    • 15 నిమిషాలైనా స్పీకర్ వీడియో రికార్డు తెప్పించలేదన్నారు.

  • 2025-03-13T14:19:24+05:30

    కావాలనే వృథా చేస్తున్నారు: పాయల్ శంకర్

    • బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    • కాంగ్రెస్-బీఆర్ఎస్ కుమ్మక్కై.. శాసనసభ సమయాన్ని వృథా చేస్తున్నాయని చెప్పారు.

    • 10 ఏళ్ల వ్యవహారాలు చర్చకు రాకుండా బీఆర్ఎస్ భయపడుతోందన్నారు పాయల్ శంకర్.

    • 15 నెలల వైఫల్యాలు చర్చకు రాకుండా కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందని సీరియస్ అయ్యారు.

    • ఇరు పార్టీల తీరు చూస్తే సభ నడవకూడదనే ధోరణిలో ఉందన్నారు బీజేపీ నేత.

    • గవర్నర్ ప్రసంగంపై అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి.. టైం గడిపేస్తున్నారని పాయల్ శంకర్ ఫైర్ అయ్యారు.

  • 2025-03-13T14:12:11+05:30

    • ఏపీ శాసనసభలో విద్యుత్ రంగంపై లఘు చర్చలో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    • ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారని ముఖ్యమంత్రి అన్నారు.

    • గతంలో కరెంటు కోతల సమయంలో రైతుల అవస్థలు ప్రత్యక్షంగా పరిశీలించానని చెప్పారు.

    • అన్నదాతల ఇబ్బందులు చూశాక పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు సీఎం.

    • విద్యుత్ సంస్కరణలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తే ప్రపంచ బ్యాంకు జీతగాడని తనను అవహేళన చేశారన్నారు చంద్రబాబు.

    • ఆ టైమ్‌లోనే డిస్కమ్‌లు, నియంత్రణ మండలి, ఎనర్జీ ఆడిటింగ్ స్టార్ట్ చేశామన్నారు.

  • 2025-03-13T13:17:54+05:30

    సీఎస్‌కే నెవర్ బిఫోర్ రికార్డ్

    • మైదానంలో రికార్డుల దుమ్ముదులిపే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సోషల్ మీడియాలోనూ అదే ఊపు ప్రదర్శించింది.

    • సీఎస్‌కే కొత్త చరిత్ర సృష్టించింది.

    • ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 17 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా సీఎస్‌కే రికార్డ్ క్రియేట్ చేసింది.

    • ఐపీఎల్ హిస్టరీలో ఏ జట్టుకూ ఇన్‌స్టాలో ఇన్ని మిలియన్ల ఫాలోవర్లు లేరు.

      పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 2025-03-13T12:41:35+05:30

    రేవంత్‌తో డీఎంకే నేతల భేటీ

    • తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో డీఎంకే ఎంపీలు కనిమొళి, రాజా, ఎన్ ఇలాంగో, కళానిధి వీరస్వామి భేటీ అయ్యారు.

    • తమిళనాడులో మార్చి 22వ తేదిన డీలిమిటేషన్ మీద జరిగే జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి రావాల్సిందిగా రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు డీఎంకే నేతలు.
      పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 2025-03-13T11:58:30+05:30

    • తెలంగాణ అసెంబ్లీ 15 నిమిషాల పాటు వాయిదా పడింది.

    • సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ఏర్పడింది.

    • మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    • దళిత స్పీకర్‌ను జగదీష్ అవమానించారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీరియస్ అయ్యారు.

  • 2025-03-13T11:40:41+05:30

    పాత సామాను పోవాలె

    • బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

    • పార్టీలో కొంతమంది ఎంపీలు , ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ లేఖ విడుదల చేశారు రాజా సింగ్.

    • తెలంగాణలో హిందువులు సేఫ్‌గా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలన్నారు.

    • బీజేపీ సర్కారు రావాలంటే పాత సామాను బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

    • ఇది నా పార్టీ అనే వాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాంటి వారిని రిటైర్ చేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని రాజా సింగ్ స్పష్టం చేశారు.

  • 2025-03-13T11:36:33+05:30

    వేడెక్కిన తెలంగాణ అసెంబ్లీ

    • గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరుగుతోంది.

    • రైతు రుణమాఫీ కాలేదని.. రైతు భరోసా రాలేదని జగదీష్ రెడ్డి అన్నారు.

    • జగదీష్ రెడ్డి మాట్లాడుతుండగా అధికార పక్షం అభ్యంతరం తెలిపింది.

    • జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.

    • దళితుడ్ని సీఎం చేస్తామని బీఆర్ఎస్ చెప్పిందని.. కానీ చేయలేదన్నారు కోమటిరెడ్డి.

    • దళితులకు 3 ఎకరాలు ఇస్తామని ఇవ్వలేదని దుయ్యబట్టారు.

    • అబద్ధాలు చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చారని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

    • అన్నదాతల కోసం ఎవరేం చేశారో అందరికీ తెలుసనని పేర్కొన్నారు.

    • నాగార్జున సాగర్, శ్రీశైలం ఎవరు కట్టారో అందరికీ తెలుసునని మంత్రి చెప్పుకొచ్చారు.

    • ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతామని.. తొందరపడొద్దని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

  • 2025-03-13T11:32:20+05:30

    పాక్ ట్రైన్ హైజాక్.. బందీలంతా సేఫ్..

    • పాకిస్థాన్ రైలు హైజాక్ ఘటనలో మొత్తం 21 మంది ప్యాసింజర్లు మృతి చెందారని ఆ దేశ ఆర్మీ జనరల్ తెలిపారు.

    • నలుగురు పారామిలిటరీ సైనికులు కూడా చనిపోయారని అన్నారు.

    • ఈ ఆపరేషన్‌లో భద్రతా బలగాల కాల్పుల్లో మొత్తం 33 మంది మిలిటెంట్లు మృతి చెందారని పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ పేర్కొన్నారు.

    • ట్రైన్‌లో ఉన్న మిలిటెంట్లను తమ భద్రతా దళాలు హతమార్చాయని.. ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసిందన్నారు షరీఫ్.

      పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 2025-03-13T10:53:57+05:30

    4 రోజులు బ్యాంకులు బంద్

    • హోలీ పండుగ కావడంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు జరగవు.

    • మార్చి 21న బడ్జెట్ మీద చర్చించనున్నారు. మూడ్రోజుల పాటు పద్దులపై డిస్కషన్స్ నడుస్తాయి.

    • దాదాపుగా 11 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నడుస్తాయి.

    • దేశంలో ఈ రోజుతో పాటు రేపు కూడా పలుచోట్ల బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.

    • మార్చి 13న హోలికా దహన్ నేపథ్యంలో డెహ్రాడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురంలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.

    • మార్చి 14న హోలీ పండుగ నేపథ్యంలో దాదాపుగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి.

    • అన్ని చోట్లా సెలవు ఉన్నా శనివారం నాడు చెన్నై, అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, ఇంఫాల్, కొచ్చి, కోహిమా, తిరువనంతపురంలో మాత్రం బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతాయి.

  • 2025-03-13T10:50:05+05:30

    నడవలేని స్థితిలో ద్రవిడ్

    • టీమిండియా మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కాలికి గాయంమైంది.

    • బెంగళూరులో క్రికెట్ ఆడుతుండగా ఆయన గాయపడినట్లు తెలుస్తోంది.

    • ఇంజ్యురీ కారణంగా రాజస్థాన్ రాయల్స్ క్యాంప్‌లో ఆలస్యంగా జాయిన్ అయ్యాడు ద్రవిడ్.

    • ఆర్ఆర్ ట్రెయినింగ్ క్యాంప్‌లో తాజాగా పాల్గొన్న ద్రవిడ్.. చేతికర్రల సాయంతో నడుస్తూ కనిపించాడు.

    పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి

  • 2025-03-13T10:47:46+05:30

    • తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు స్టార్ట్ అయ్యాయి.

    • గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాష్ట్ర సర్కారు తరఫున విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు.

    • ఈ తీర్మానంపై చర్చ జరగనుంది.

    • హోలీ పండుగ కావడంతో శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు జరగవు.

    • మార్చి 21న బడ్జెట్ మీద చర్చించనున్నారు. మూడ్రోజుల పాటు పద్దులపై డిస్కషన్స్ నడుస్తాయి.

    • దాదాపుగా 11 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్ నడుస్తాయి.