Share News

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:26 AM

కేంద్రం చేపట్టనున్న డీలిమిటేషన్ విధానంపై వ్యతిరేకతకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు సీఎం వద్దని చెప్పగా, ఇప్పుడు తెలంగాణ సీఎం కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన డీఎంకే నేతలు.. కారణమిదేనా..
CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఈ నెల 22న జరగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశానికి హాజరు కావాలని తమిళనాడు డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఈ క్రమంలో జేఏసీ సమావేశానికి రేవంత్ రెడ్డి రావాలని డీఎంకే ఎంపీలు కనిమొళి, రాజా, ఎన్. ఇలాంగో, కళానిధి వీరస్వామి సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. స్టాలిన్ డీలిమిటేషన్ విషయంలో చూపిన చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. తమిళనాడులో సమావేశానికి హాజరయ్యేందుకు ఏఐసీసీ అనుమతి తీసుకుని వస్తామన్నారు.


తెలంగాణలో కూడా..

డీలిమిటేషన్ ప్రక్రియ సౌత్ రాష్ట్రాలపై ప్రభావం చూపుతుందని, సౌత్ రాష్ట్రాలు ఉత్తరాది రాష్ట్రాల కంటే ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నాయని ఈ సందర్భంగా రేవంత్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా రావాలని కోరుతున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి తన అభిప్రాయాలను కేంద్ర క్యాబినెట్‎లో వినిపించాల్సిన అవసరం ఉందని రేవంత్ ప్రస్తావించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు కూడా ఆ సమావేశంలో పాల్గొనాలని కోరారు.

telangana cm revanth.jpg


డీఎంకే నేతలు

ఈ క్రమంలో డీలిమిటేషన్ పై మార్చి 22, 2025న జరుగనున్న జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమావేశానికి ముఖ్యమంత్రికి ఆహ్వానం అందింది. తమిళనాడులో జరగనున్న ఈ సమవేశానికి పలు ప్రాంతీయ పార్టీలు హాజరై డీలిమిటేషన్ పై వారి అభిప్రాయాలను తెలియజేయనున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ పై తమిళనాడు డీఎంకే నేతలు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ తమ రాష్ట్రంలో ప్రజల హక్కులను హరించే దిశగా ఉందని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ కూడా ఈ అంశంపై చర్చిస్తామన్నారు.


జేఏసీ సమావేశానికి అనేక రాష్ట్రాలు

దీంతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ముఖ్యమైన చర్చలకు ఒక వేదికగా నిలిచే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ వంటి ప్రాంతాల ప్రగతికి సంబంధించిన నిర్ణయాలను తీసుకునేందుకు కీలక అంశంగా మారనుంది. డీలిమిటేషన్ వల్ల వచ్చే రాజకీయ పరిణామాలు, రాష్ట్రాల మధ్య సంబంధాలు, వాస్తవాలపై ప్రాధాన్యం కలిగిన అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. అయితే ఈ భేటీకి మరికొన్ని రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మరిన్ని రాష్ట్రాలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

Heavy Rains: వేసవిలో తుఫానులు.. మార్చి 15 వరకు ఈ ప్రాంతాల్లో వర్షాలు


Bank Holidays: హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్..

Train Hijack: రైలు హైజాక్ ఆపరేషన్ సక్సెస్.. 346 మంది బందీలకు ఫ్రీడమ్..

Gold Silver Rates Today: హోలీకి ముందే షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Mar 13 , 2025 | 12:48 PM