-
-
Home » Mukhyaamshalu » Today Breaking News Live Updates Wednesday 14th May 2025 Top Headlines and Major Events Across India Siva
-
Breaking News: గవర్నర్‌కు అవమానం..
ABN , First Publish Date - May 14 , 2025 | 08:18 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
May 14, 2025 21:44 IST
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం..
ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు
తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ప్రభాకర్ రావు
ప్రభాకర్ రావు పిటిషన్ విచారించిన జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం
తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
ప్రభాకర్ రావు పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే అమెరికా నుంచి వస్తానని తెలంగాణ హైకోర్టులో గతంలో పిటిషన్
గతంలో ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ తోసిపుచ్చిన తెలంగాణ హైకోర్టు
-
May 14, 2025 20:44 IST
AP POLYCET Results 2025: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా పాలిసెట్ ఫలితాలను విడుదలు చేశారు. ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ పరీక్షను 1,39,840 మంది పరీక్ష రాశారు. దీనిలో 1, 33,358 మంది పాసైనట్లు మంత్రి వెల్లడించారు.
-
May 14, 2025 20:14 IST
మూడు సిలిండర్ల నగదు చెల్లించేది అప్పుడే..
సంక్షేమ పథకాల అమలుపై టీడీపీ పొలిట్‌బ్యూరోలో కీలక నిర్ణయాలు
దీపం పథకం నగదు ముందుగానే చెల్లించాలని పొలిట్‌బ్యూరోలో నిర్ణయం
సిలిండర్ బుకింగ్‌కు ముందే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయం
ఏడాదిలో ఒక నెలలో 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లించాలని నిర్ణయం
సిలిండర్ తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి చెల్లించాలని నిర్ణయం
ప్రతినెలా సంక్షేమం అందేలా ఏడాది సంక్షేమ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం
జూన్ 12న లక్షమంది ఒంటరి మహిళలు, వితంతువులకు ఇవ్వాలని నిర్ణయం
గత ప్రభుత్వం నిలుపుదల చేసిన పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయం
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు జూన్ 12న ప్రారంభించాలని నిర్ణయం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2 నెలల్లో ప్రారంభించేలా చర్యలకు నిర్ణయం
-
May 14, 2025 20:13 IST
దేశవ్యాప్తంగా జైహింద్ ర్యాలీ..
దేశవ్యాప్తంగా 'జైహింద్ ర్యాలీ' నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయం
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలని ర్యాలీ ద్వారా ప్రశ్నిస్తాం: జైరాం రమేష్
ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలని ర్యాలీ ద్వారా ప్రశ్నిస్తాం: జైరాం రమేష్
'ఆపరేషన్ సిందూర్'పై రాజకీయాలు చేయడం తప్పు: జైరాం రమేష్
-
May 14, 2025 20:12 IST
తిరంగా ర్యాలీలు..
ఉగ్ర దాడిలో అమరులైన వారికి సంఘీభావంగా తిరంగా ర్యాలీలు: మంత్రి అచ్చెన్నాయుడు
ఎల్లుండి నుంచి 3 రోజులపాటు తిరంగా ర్యాలీల నిర్వహణ: అచ్చెన్నాయుడు
అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీలు
మహానాడులోగా పార్టీ సంస్థాగత ఎన్నికలు, కమిటీలు పూర్తిచేయాలని నిర్ణయం: అచ్చెన్న
-
May 14, 2025 20:11 IST
తెలంగాణకు అన్యాయం జరిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగింది: సీఎం రేవంత్‌రెడ్డి
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తికాలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
జలయజ్ఞంలో మొదలైన ప్రాజెక్టులు గత పదేళ్లలోనూ పూర్తికాలేదు
ప్రాజెక్టుల పేరుతో ఖర్చుపెట్టిన నిధులు ఎవరి జేబుల్లోకి పోయాయి
నీటిపారుదల శాఖలో గత పదేళ్లలో నియామకాలు చేపట్టలేదు
మా ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత నీటిపారుదలశాఖ: సీఎం రేవంత్‌రెడ్డి
దేశానికి తొలి ప్రధాని కూడా ప్రాజెక్టులే తొలి ప్రాధాన్యతగా తీసుకున్నారు
గతంలో కట్టిన ప్రాజెక్టులు చూడండి.. కాళేశ్వరం చూడండి: సీఎం రేవంత్
సాంకేతిక పరిజ్ఞానం లేనప్పుడే సాగర్, శ్రీశైలం, నిజాంసాగర్ కట్టారు
ఎన్నో వరదలు వచ్చినా చెక్కుచెదరలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ఉద్యమాన్ని భావోద్వేగంగా మార్చి రాజకీయంగా వాడుకున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
ఎవరు ఏ పనిచేయాలో వాళ్లే చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
లక్ష కోట్లు పెట్టిన ప్రాజెక్టు 50వేల ఎకరాలకు నీరు ఇవ్వలేదు: సీఎం రేవంత్‌రెడ్డి
కట్టిన మూడేళ్లకే కుప్పకూలిన ప్రాజెక్ట్ ఈ భూ ప్రపంచంలో లేదు: సీఎం రేవంత్
మేడిగడ్డ, సుందిళ్లలో కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు: రేవంత్‌రెడ్డి
నాయకులు పరిమిత జ్ఞానంతో చెబితే పనులు చేయవద్దు: సీఎం రేవంత్‌రెడ్డి
నేతల మాటలు వింటే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది: సీఎం రేవంత్‌రెడ్డి
విజిలెన్స్, NDSA రిపోర్టులు కూడా తప్పుబట్టాయి: సీఎం రేవంత్‌రెడ్డి
సీతారామ ప్రాజెక్టు పిల్లర్లు కూడా కూలిపోతున్నాయి: సీఎం రేవంత్‌రెడ్డి
ఏ ప్రాజెక్టును ఏం చేయాలో అర్ధం కావడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణ ప్రజలు నీటి కోసం పోరాడారు: సీఎం రేవంత్‌రెడ్డి
జలాల కోసం అందరం పనిచేద్దాం: సీఎం రేవంత్‌రెడ్డి
ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
May 14, 2025 19:10 IST
గవర్నర్‌కు అవమానం..
ఢిల్లీ: ఏపీ భవన్‌లో రాష్ట్ర ప్రథమ పౌరుడు నజీర్‌కు అవమానం
ఏపీ గవర్నర్ నజీర్‌ను పట్టించుకోని రెసిడెంట్ కమిషనర్
రాష్ట్రపతి భవన్‌లో కొత్త CJI ప్రమాణస్వీకార కార్యక్రమంలో హాజరయ్యేందుకు నిన్న ఢిల్లీ వెళ్లిన గవర్నర్ అబ్దుల్ నజీర్
గవర్నర్, సీఎం వస్తే ప్రొటోకాల్ ప్రకారం ఎయిర్‌పోర్ట్‌లో తప్పనిసరిగా రెసిడెంట్ కమిషనర్ స్వాగతం పలకాలని నిబంధనలు
ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్
నిన్న కలవకపోగా ఇప్పటివరకూ గవర్నర్‌ని మర్యాదపూర్వకంగా కలవని రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్
-
May 14, 2025 17:43 IST
ఏరివేత కొనసాగుతోంది: CRPF డీజీ
మావోయిస్టుల ఏరివేత కొనసాగుతోంది: CRPF డీజీ
కర్రెగుట్టపై భారీగా ఆయుధాలు స్వాధీనం: డీజీ జ్ఞానేంద్ర
ఇప్పటివరకు 31 మంది మావోయిస్టులు మృతి
మృతుల్లో 16 మంది మహిళా మావోయిస్టులు
రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్లు స్వాధీనం: డీజీ జ్ఞానేంద్ర
ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది: CRPF డీజీ జ్ఞానేంద్ర
-
May 14, 2025 17:42 IST
కల్నల్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు.. మంత్రికి షాక్..
మధ్యప్రదేశ్ మంత్రి విజయ్‌షాపై హైకోర్టు ఆగ్రహం
కల్నల్ ఖురేషీపై మంత్రి విజయ్‌షా అనుచిత వ్యాఖ్యలు
తక్షణమే విజయ్‌షాపై FIR నమోదుచేయాలని ఆదేశం
-
May 14, 2025 17:41 IST
దిగొచ్చిన పాక్..
భారత్‌కు పాకిస్థాన్ లేఖ
తీవ్ర నీటిఎద్దడిని ఎదుర్కొంటున్నామన్న పాకిస్థాన్
-
May 14, 2025 16:47 IST
ఆ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్
అమరావతి: ఏపీఆర్ఎస్ క్యాట్, ఏపిఆర్ జెసి అండ్ ఏపిఆర్ డిసి సెట్ 2025 ఫలితాలు వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్
మొత్తం 73,993 మంది దరఖాస్తు చేయగా 62,047 మంది పరీక్షకు హజరయ్యారు: మంత్రి నారా లోకేశ్
5, 8, ఇంటర్, డిగ్రీలలో మొత్తం 7,190 సీట్ల కోసం పరీక్షలు రాసిన 62,047 మంది విద్యార్థులు: మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలపై విద్యార్థుల్లో పెరుగుతున్న నమ్మకాన్ని ఈ పరీక్షలు తెలియజేస్తున్నాయి: మంత్రి నారా లోకేశ్
-
May 14, 2025 16:45 IST
మంత్రి ఆగ్రహం.. ఎందుకంటే..
గర్భిణి మృతిపై విచారణకు ఆదేశించిన మంత్రి సత్యకుమార్
పోలవరం ప్రభుత్వాపత్రిలో గర్భిణి మృతిపై విచారణకు ఆదేశం
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సెకండరీ హెల్త్ డైరెక్టర్‌కు ఆదేశం
-
May 14, 2025 16:44 IST
కడప మేయర్ సురేశ్ బాబుపై వేటు..
అవినీతి ఆరోపణలతో కడప మేయర్ సురేశ్ బాబు తొలగింపు
సురేశ్ బాబును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు
కడప మేయర్ సురేశ్ బాబుపై అనర్హత వేటు వేస్తూ ఆదేశాలు
కుటుంబసభ్యుల సంస్థతో కడపలో పనులు చేయించినట్లు ఆరోపణలు
రూ.36 లక్షల అవినీతికి పాల్పడినట్లు సురేశ్ బాబుపై ఆరోపణలు
-
May 14, 2025 16:12 IST
బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు ప్రస్తావించిన సిట్
లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్పను ACB కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
లిక్కర్ స్కామ్ కేసులో బాలాజీ గోవిందప్ప కీలకపాత్ర: సిట్
లిక్కర్ కేసులో కీలక నిందితుడు రాజ్ కసిరెడ్డికి బాలాజీ గోవిందప్ప సన్నిహితుడు: సిట్
మద్యంలో ప్రధాన బ్రాండ్లు నిలిపివేసి తమకు అనుకూలమైన బ్రాండ్లు మార్కెట్లోకి విడుదల చేయడంలో గోవిందప్ప కీలక పాత్ర: సిట్
సొంత బ్రాండ్లు మార్కెట్లోకి విడుదల చేసి రూ.కోట్లు కొల్లగొట్టిన గోవిందప్ప, రాజ్ కసిరెడ్డి: సిట్
సిండికేట్‌లో గోవిందప్ప కీలకపాత్ర పోషించారని గతంలో చెప్పిన అధికారులు సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి
అనుకూల కంపెనీలతో లిక్కర్‌లో ఎలా ఆర్డర్స్ పెట్టాలో రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప ఆదేశాలు ఇచ్చే వాళ్లు: సిట్
డిస్టిలరీల ద్వారా సప్లయర్స్ నుంచి సేకరించిన కమీషన్లు మొత్తం బాలాజీ గోవిందప్పకు చేరాయి: సిట్
లిక్కర్ ద్వారా వచ్చిన మొత్తాన్ని వీరంతా కలసి మళ్లించారు: సిట్
ఆయా డబ్బులతో స్తిరాస్తులు,లగ్జరీ కార్లు కొనుగోలు చేశారు: సిట్
గోవిందప్పకు డబ్బు ఎలా మళ్లించాలనేది మొత్తం తెలుసు: సిట్
ఇలాంటి కేసుల్లో 10 ఏళ్ల వరకు నిందితులకు శిక్ష పడుతుంది: సిట్
బాలాజీ గోవిందప్ప దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది: సిట్
కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది: సిట్
రిమాండ్ విధించాలని కోరిన సిట్ అధికారులు
లిక్కర్ కేసులో గత ప్రభుత్వ పెద్దల హస్తం ఎంత మేరకు ఉంది విచారణ చేయాలి: సిట్
లిక్కర్ స్కామ్‌లో వచ్చిన మొత్తాన్ని కిక్ బ్యాగ్స్ ద్వారా మళ్లించారు: సిట్
-
May 14, 2025 16:03 IST
ఎక్స్ ఖాతాలు నిలిపివేత..
చైనా మీడియా సంస్థల 'ఎక్స్' ఖాతాలు భారత్‌లో నిలిపివేత
చైనా అధికార వార్తా సంస్థ షిన్హుహ, గ్లోబల్ టైమ్స్ 'ఎక్స్' ఖాతాలు నిలిపివేత
పాక్ అనుకూల వార్తల ఆరోపణలతో భారత్‌లో నిలిపివేత
తుర్కియే వార్తా సంస్థ 'ఎక్స్' ఖాతా భారత్‌లో నిలిపివేత
-
May 14, 2025 16:01 IST
నిజమైన స్నేహానికి పాక్ నిదర్శనం పాక్: తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్
ఆపరేషన్ సిందూర్ తర్వాత తుర్కియే అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు
నిజమైన స్నేహానికి పాక్ నిదర్శనమన్న తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్
భవిష్యత్‌లోనూ ఆపన్నహస్తం అందిస్తామని పాక్‌కు భరోసా
పాక్ ప్రధాని షెహబాజ్‌ను విలువైన మిత్రుడిగా అభివర్ణించిన ఎర్డోగాన్
-
May 14, 2025 16:00 IST
నెలకు 3.6 కోట్ల చిప్‌ల ఉత్పత్తి: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
వేగంగా జరుగుతోన్న సెమీకండక్టర్ల యూనిట్ల నిర్మాణం: అశ్వినీ వైష్ణవ్
ఒక యూనిట్‌లో ఉత్పత్తి ఈ ఏడాదిలోనే ప్రారంభం: అశ్వినీ వైష్ణవ్
సెమీ కండక్టర్ల యూనిట్‌లో నెలకు 3.6 కోట్ల చిప్‌ల ఉత్పత్తి
HCL, ఫాక్స్‌కాన్ సంస్థల జాయింట్ వెంచర్‌గా..
సెమీకండక్టర్ యూనిట్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
270 వర్సిటీల్లో విద్యార్థులకు సెమీకండక్టర్ల సాంకేతికతపై శిక్షణ
సెమీ కండక్టర్ల సాంకేతికతపై 70 స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి: అశ్వినీ వైష్ణవ్
విద్యార్థులు రూపొందించిన 20 చిప్‌లను మొహాలీలో ఉత్పత్తి చేశారు: అశ్వినీ వైష్ణవ్
-
May 14, 2025 15:59 IST
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు ఇవే..
కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
సెమీ కండక్టర్ పరిశ్రమకు ప్రోత్సాహం
యూపీలో జేవర్‌లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ నిర్మాణం
రూ.3,706 కోట్లు కేటాయించిన కేంద్రం
కొత్త సెమీ కండక్టర్ యూనిట్‌తో 2వేల మందికి ఉపాధి
బెంగళూరు, నోయిడాలో చిప్స్ హబ్స్
తిరుపతి IIT విస్తరణకు ఆమోదం
-
May 14, 2025 15:58 IST
కాసేపట్లో టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
మహానాడు నిర్వహణపై పొలిట్‌బ్యూరోలో నిర్ణయం
కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు
ఈ నెల 29న భారీ బహిరంగసభ
-
May 14, 2025 15:57 IST
వారిద్దరూ భాగమే: BCCI
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికీ భారత్ క్రికెట్‌లో భాగమే: BCCI
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు 'ఏ ప్లస్' గ్రేడ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తాం: BCCI
'ఏ ప్లస్' గ్రేడ్ సౌకర్యాలన్నీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు కొనసాగిస్తాం: BCCI
టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ 'ఏ ప్లస్' గ్రేడ్ కొనసాగిస్తాం: BCCI
-
May 14, 2025 15:56 IST
బిల్ గేట్స్‌తో కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టాం: చంద్రబాబు
దేశంలో వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్‌వన్: సీఎం చంద్రబాబు
వ్యవసాయంతో పాటు సర్వీస్ సెక్టార్ కీలకం: సీఎం చంద్రబాబు
తెలంగాణలో ఆదాయం 60 శాతం సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది: సీఎం చంద్రబాబు
75 శాతం తెలంగాణ ఆదాయం కేవలం హైదరాబాద్ నుంచే వస్తోంది: సీఎం చంద్రబాబు
చాట్ జీపీటీ దేశంలో ఎక్కువగా వాడేది ఏపీనే: చంద్రబాబు
దేశంలో ఆధార్‌లో నెంబర్‌వన్ ఏపీనే: చంద్రబాబు
ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నాం: చంద్రబాబు
బిల్ గేట్స్‌తో కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టాం: చంద్రబాబు
డిజిటల్ ఆన్‌లైన్ రికార్డు కార్యక్రమం చేపట్టాం: చంద్రబాబు
వచ్చే రెండేళ్లలో ఏపీలో పూర్తిచేస్తాం: చంద్రబాబు
మొన్నటి దాకా AI.. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడుతున్నా: సీఎం చంద్రబాబు
-
May 14, 2025 15:55 IST
రైతుల పిల్లలూ IT చేయాలి: సీఎం చంద్రబాబు..
ప్రస్తుత టెక్నాలజీతో మన ఆరోగ్యం మన చేతుల్లోనే: సీఎం చంద్రబాబు
వచ్చే 4 నెలల్లో 100 శాతం వాట్సాప్ గవర్నెన్స్ అందిస్తాం: సీఎం చంద్రబాబు
రాబోయే రోజుల్లో GFST లాంటి సంస్థలు మరిన్ని ఏర్పాటు చేయాలి: సీఎం చంద్రబాబు
వ్యవసాయ కూలీలు, రైతుల పిల్లలు IT చేయాలని గతంలో పిలుపు నిచ్చాం: సీఎం చంద్రబాబు
ఇప్పుడు కొత్త నినాదంతో ముందుకు వస్తున్నాం: సీఎం చంద్రబాబు
ప్రతి ఇంటికి ఓ ఎంట్రప్రైన్యూర్ తయారు కావాలి: సీఎం చంద్రబాబు
గోదార్‌కు పైలెట్ ప్రాజెక్ట్‌గా చిత్తూరు జిల్లా ఎంపిక: సీఎం చంద్రబాబు
IT కంపెనీల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే ఇప్పుడు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు: సీఎం చంద్రబాబు
డెయిరీ షెడ్లకు పల్లె లేదా పట్టణాల్లో అయినా ప్రాపర్టీ టాక్స్ రద్దు: సీఎం చంద్రబాబు
-
May 14, 2025 13:15 IST
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం
టర్కీ సోషల్ మీడియాపై నిషేధం విధించిన భారత్.
టర్కిష్ బ్రాడ్‌కాస్టర్ 'TRT వరల్డ్' యొక్క ఎక్స్ ఖాతాపై నిషేధం.
చైనా గ్లోబల్ టైమ్స్ పేపర్‌పై నిషేధం విధించిన భారత్.
పాకిస్తాన్ భారత్ ఉద్రిక్తతల సమయంలో భారత్‌పై పాకిస్తాన్ వినియోగించిన డ్రోన్లు టర్కీస్ నుంచి కొనుగోలు చేసినట్టు తేల్చిన భారత్.
-
May 14, 2025 12:57 IST
బలూచిస్థాన్‌ను దేశంగా గుర్తించండి..
న్యూఢిల్లీ, మే 14: భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఐక్యరాజ్య సమితికి బలూచ్ వెల్‌ఫేర్ అసోసియేషన్ లేఖ రాసింది.
బలూచిస్థాన్ ప్రాంతాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది.
70 సంవత్సరాలకు పైగా బలూచిస్థాన్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వ అణచివేతకు గురయ్యారని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
బలవంతపు గల్లంతులు, సైనిక దాడులు, వనరుల దోపిడీ, సాంస్కృతిక అణచివేత జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది మానవ హక్కుల ఉల్లంఘనగా బీడబ్ల్యూఏ అభివర్ణించింది.
-
May 14, 2025 12:53 IST
BJPనేత NVSS ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది
రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు
కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం కాబోతోంది
జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత విలీనం
కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తాన్న హరీశ్ వ్యాఖ్యలే నిదర్శనం
-
May 14, 2025 12:05 IST
BSF జవాన్‌ను విడుదల చేసిన పాకిస్థాన్
అటారీ సరిహద్దులో పాక్ రేంజర్‌ను విడుదల చేసిన భారత్
20 రోజుల తర్వాత పూర్ణమ్ కుమార్ షా విడుదల
అనుకోకుండా పాక్ భూభాగంలోకి ప్రవేశించిన పీకే షా
-
May 14, 2025 11:58 IST
విజయవాడ: బీజేపీలో కులమతాలకు తావులేదు: పురంధేశ్వరి
బీజేపీ నినాదం సబ్ కే సాత్.. సబ్ కా వికాస్.
బీజేపీలో కులమతాలకు తావులేదు.
ఇది బీజేపీ మూల సిద్ధాంతం.
శాసన మండలి వైస్ చైర్మన్‌కి రాజీనామా చేసి జకియా ఖానమ్ బీజేపీలో చేరడం చాలా సంతోషం.
మైనార్టీలకు బీజేపీపై ఉన్న ప్రేమ, విశ్వాసం జకియా ఖానం చేరికతో మరోసారి రుజువైంది.
మైనార్టీలకు బీజేపీలో మంచి స్థానం ఉంటుంది.
జకియా ఖానమ్ కుటుంబం ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటుంది.
జకియా ఖానమ్‌ను మనస్ఫూర్తిగా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం.
కులమతాలకు అతీతంగా పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే బీజేపీ లక్ష్యం.
దేశానికి బీజేపీ సుపరిపాలన అందిస్తోంది.
పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగితే భారత్ గట్టిగానే బుద్ధి చెప్పింది.
ప్రధాని నరేంద్ర మోడీ దృఢమైన నిర్ణయం తీసుకున్నారు.
2014 ముందు కళ్ళు మూసుకునే పరిస్థితి ఉండేది.
2014 తరువాత పరిస్థితులు మారాయి.
ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలతో ప్రత్యర్థులు హడలిపోయారు.
ఉగ్రస్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసిన భారత్ సైన్యం సామర్థ్యం అద్భుతం.
మన యుద్ధం ఉగ్రవాదులపై అనే సందేశం ప్రధాని ప్రపంచానికి తెలియజేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులకు తర్ఫీదు ఇచ్చేవారు.
అందుకే మన యుద్ధం పాకిస్తాన్ పౌరులమీద కాకుండా.. ఉగ్రవాదులపై యుద్ధం చేశాం.
బలమైన నాయకత్వం, సత్తా ఉన్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ.
అటువంటి నాయకత్వాన్ని ప్రధాని మోదీ రూపంలో బీజేపీ ఈరోజు దేశానికి అందించింది.
-
May 14, 2025 11:53 IST
భారత్‌లో గ్లోబల్ టైమ్స్ పత్రిక ఎక్స్ ఖాతాపై నిషేధం
భారత ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తోందని ఆరోపణ
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్‌పై కేంద్రం చర్యలు
-
May 14, 2025 11:21 IST
ఢిల్లీ ఏపీ భవన్ స్పెషల్ కమిషనర్‌గా అర్జా శ్రీకాంత్ బాధ్యతలు.
2014-19 మధ్య ఏపీ భవన్ అదనపు కమిషనర్‌గా శ్రీకాంత్ విధులు.
2019లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా వ్యవహరించిన శ్రీకాంత్.
కేంద్రం దగ్గర ఏపీ పెండింగ్ పనులు, విభజన చట్టం అమలు బాధ్యతలను అర్జా శ్రీకాంత్‌కు అప్పగించిన సీఎం చంద్రబాబు.
-
May 14, 2025 10:51 IST
ఏలూరు: పోలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం..
పోలవరం ప్రభుత్వాసుపత్రిలో నిండు గర్భిణీ మృతి.
గత రాత్రి నడుచుకుంటూ ఆసుపత్రికి వచ్చిన గర్భిణీ.
ప్రభుత్వాసుపత్రిలో ఉన్న నర్సులతో వైద్యం చేయించారంటూ ఆరోపిస్తున్న భర్త.
పోలవరం మండలం కొత్త కుంకాల గ్రామానికి చెందిన గిరిజన మహిళ తామ శిరీష.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వలనే తన భార్య మృత్యువాత పడింది అంటున్న భర్త.
-
May 14, 2025 10:23 IST
సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్.
52వ సీజేఐగా ప్రమాణం చేసిన బీఆర్ గవాయ్.
ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఆయనతో ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ద్రౌపదీముర్ము.
-
May 14, 2025 10:04 IST
న్యూఢిల్లీ: ఈ నెల 25 న ఢిల్లీలో ఎన్‌డిఎ ముఖ్యమంత్రుల సమావేశం.
హాజరుకానున్న బిజెపి, మిత్రపక్షాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు.
సమావేశానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, బీహార్ సీఎం నీతిష్ కుమార్ సహా అందరు ఎన్‌డిఎ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు ఆహ్వానం.
ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ తదితర అంశాలను ఎన్‌డిఎ సీఎం, డిప్యూటీ సీఎంలకు వివరించనున్న కేంద్ర ముఖ్యులు.
ఈ నెల 24న ఢిల్లీలో నీతి అయోగ్ సమావేశం.
నీతి అయోగ్ సమావేశానికి అందరు ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం వుండటంతో మరుసటి రోజు 25న ఎన్‌డిఎ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం ఏర్పాటు చేసిన బీజేపీ.
-
May 14, 2025 08:29 IST
బాపట్ల: చీరాలలో మున్సిపల్ చైర్మన్ పీఠంపై ఉత్కంఠ.
ఈరోజు చీరాల మున్సిపాలిటి చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం.
ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ఏర్పాటు.
ఇటీవల వైసీపీని వీడి టిడిపి గూటికి చేరిన చైర్మన్ జంజనం శ్రీనివాసరావు.
శ్రీనివాసరావు వైసీపీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సమయంలో అవిశ్వాసం కోరుతూ నోటీసులు.
అవిశ్వాసం వీగి శ్రీనివాసరావు చైర్మన్‌గా కొనసాగుతారా లేదా అన్న అంశంపై ఉత్కంఠ.
-
May 14, 2025 08:18 IST
శాసన మండలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.
మరో వికెట్ డౌన్.
మండలి డిప్యూటీ చైర్మెన్‌గా ఉన్న జకియా ఖానమ్ వైసీపకి, పదవికి రాజీనామా చేశారు.
ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో బీజేపీలో చేరే అవకాశం.
ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మంత్రి సత్యకుమార్‌ను కలిసిన ఖానమ్.
గత రాత్రి రాజీనామా లేఖను మెయిల్‌లో పంపిన ఖానమ్.