AP POLYCET Results 2025: పాలిసెట్ ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
ABN , Publish Date - May 14 , 2025 | 02:21 PM
AP POLYCET Results 2025: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ పరీక్షను 1,39,749 మంది పరీక్ష రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని మే 2వ తేదీన విడుదల చేయగా.. ఇప్పుడు తుది ఫలితాలను విడుదల చేశారు.

AP POLYCET Results 2025: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా పాలిసెట్ ఫలితాలను విడుదలు చేశారు. ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించిన ఈ పాలిసెట్ పరీక్షను 1,39,840 మంది పరీక్ష రాశారు. దీనిలో 1, 33,358 మంది పాసైనట్లు మంత్రి వెల్లడించారు. ఈ పరీక్షల్లో 95.36 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. ఈ పరీక్షల్లో 96.9 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని మంత్రి నారా లోకేశ్ వివరించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ ని మే 2వ తేదీన విడుదల చేయగా.. ఇప్పుడు తుది ఫలితాలను విడుదల చేశారు.
ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి..
ముందుగా బ్రౌజర్ ఓపెన్ చేసి ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ https://polycetap.nic.in/ ఓపెన్ చేయాలి.
ఇప్పుడు ఏపీ Polycet Results 2025 అప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ మీ లాగిన్ వివరాలు నమోదు చేయాలి.
వివరాలను సబ్‌మిట్ చేయగానే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
ఇప్పుడు మీ ర్యాంక్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
ఇది మీ భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది.
మన మిత్ర యాప్‌లో ఈ వాట్సప్ నెంబర్ 9552300009కి Hi అని మెసేజ్ పెట్టడం ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చును.
Also Read:
గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో కీలక అంశాలు
For More Andhra Pradesh News and Telugu News..