-
-
Home » Mukhyaamshalu » latest Breaking Cinema Business National and International ABN Andhra Jyothy news across the globe 20th sept 2025 kjr
-
BREAKING: రైల్వేస్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం
ABN , First Publish Date - Sep 20 , 2025 | 06:32 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Sep 20, 2025 20:14 IST
అమెరికా H-1B వీసా నిబంధనలపై స్పందించిన భారత్
H-1B వీసా కొత్త నిబంధనలు పరిశీలిస్తున్నాం: విదేశాంగశాఖ
H-1B వీసా పరిణామాలను అధ్యయనం చేస్తున్నాం: విదేశాంగశాఖ
ఇది అమెరికా, భారత్‌లోని సంస్థలను ప్రభావితం చేసే అంశం
అమెరికా నిర్ణయంతో ఎన్నో కుటుంబాలకు ఇబ్బందులు: విదేశాంగశాఖ
సున్నిత అంశాలపై విధాన నిర్ణేతలు ఆచితూచి అడుగులు వేయాలి
కొత్త వీసా నిబంధనలతో తలెత్తే ఇబ్బందిని..
అమెరికా గుర్తిస్తుందని ఆశిస్తున్నాం: భారత విదేశాంగశాఖ
-
Sep 20, 2025 20:14 IST
సెంచరీ చేసిన స్మృతి మంధాన..
భారత్ తరఫున వన్డేల్లో వేగవంతమైన సెంచరీ చేసిన స్మృతి మంధాన
ఆస్ట్రేలియాపై 50 బంతుల్లోనే సెంచరీ చేసిన స్మృతి మంధాన
మహిళల వన్డే క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన మంధాన
-
Sep 20, 2025 15:18 IST
హైదరాబాద్: చర్లపల్లి పీఎస్ పరిధిలో మృతదేహం కలకలం
రైల్వేస్టేషన్ సమీపంలో గోనె సంచిలో మహిళ మృతదేహం
నిన్న ఉ.11గంటలకు మృతదేహం పడిసి వెళ్లినట్టు గుర్తింపు
-
Sep 20, 2025 13:53 IST
టీటీడీ పరకామణిలో చోరీ వీడియో విడుదల చేసిన భానుప్రకాష్‌రెడ్డి
పరకామణిలో రవికుమార్ దోచుకుంటే..
వైసీపీ నేతలు, అధికారులు పంచుకున్నారు: భానుప్రకాష్‌రెడ్డి
కోట్లాది రూపాయలను రియల్ ఎస్టేట్‌లో పెట్టారు..
వైసీపీ హయాంలో రూ.100 కోట్లు దోచుకున్నారు..
అప్పట్లో టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి ఉన్నారు
చోరీ అంశంపై భూమన సమాధానం చెప్పాలి..
అప్రూవర్‌గా మారనున్న ఓ అధికారి అన్నీ బయటపెడతారు..
త్వరలో అందరి పేర్లు బయటకు వస్తాయి: టీటీడీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి
-
Sep 20, 2025 13:02 IST
పట్టాలపై సిగరెట్ తాగుతుండగా.. రైలు ఢీకొని..
రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి
తెల్లవారుజామున బొల్లారం బజారు రైల్వే స్టేషన్ వద్ద ఘటన
ముగ్గురు స్నేహితులు రైలు పట్టాలపై కూర్చుని సిగరెట్ తాగుతుండగా రైలు ఢీకొని ఇద్దరు మృతి.
ఒకరి పరిస్థితి విషమం.. గాయపడిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
-
Sep 20, 2025 11:47 IST
ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ కంపెనీ కీలక ఆదేశాలు..
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
హెచ్ 1బీ వీసాలకు సంబంధించిన కొత్త ఉత్తర్వులు రేపటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
తమ ఉద్యోగులకు స్టార్ట్ ఇమీడియట్లీ ఆదేశాలు జారీ చేసింది.
‘హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు ఉన్న మా ఉద్యోగులు రేపటి లోగా అమెరికాలోకి వచ్చేయాలి.
హెచ్ 1బీ, హెచ్ 4 వీసాలు కలిగి.. ప్రస్తుతం బయటి దేశాల్లో ఉన్న ఉద్యోగులు గడువు తేదీలోగా అమెరికా చేరుకోవాలి’ అని స్పష్టం చేసింది.
-
Sep 20, 2025 11:36 IST
మాజీ ఎమ్మెల్యేపై సీఎం రమేష్ ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాదరి కిశోర్.. తనపై దూషణలకు దిగారని సీఎమ్ రమేష్ పేర్కొన్నారు.
దరి కిశోర్‌కు నోటీసులు ఇచ్చిన జూబ్లీహిల్స్ పోలీసులు.
ఈరోజు ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకానున్న గాదరి కిశోర్
-
Sep 20, 2025 09:30 IST
కుషాయిగూడలో దారుణం
భార్య గొంత కోసిన భర్త
కుషాయిగూడలోని పరిధిలోని రాధిక థియేటర్ సమీపంలో ఘటన...
బంధువుల ఇంట్లో భార్యను హత్య చేసిన భర్త...
మృతురాలు మహారాష్ట్ర ముంబై వాసిగా గుర్తింపు..
భార్యను హత్య చేసి పరారైన భర్త..
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
-
Sep 20, 2025 09:18 IST
ఢిల్లీలోని పలు స్కూల్స్‌కి బాంబు బెదిరింపు
డీపీఎస్ ద్వారక, కృష్ణ మోడల్ పబ్లిక్ స్కూల్, సర్వోదయ విద్యాలయ స్కూల్‌కి బాంబు బెదిరింపు
స్కూల్స్‌కి చేరుకుని తనిఖీలు నిర్వహించిన పోలీసులు
టీచర్లను, విద్యార్థులను స్కూల్ నుంచి బయటికి పంపించిన అధికారులు
విచారణ చేపట్టిన పోలీసులు
-
Sep 20, 2025 09:08 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు..
135 నాన్ డ్యూటీ లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు.
గోవా, హర్యానా ,ఉత్తరప్రదేశ్, లక్నో పలు ప్రాంతాల నుండి హైదరాబాద్‌కి తీసుకువచ్చినట్టు గుర్తింపు
దసరా సందర్భంగా ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు మద్యాన్ని తీసుకొస్తున్న ముఠాలు
అక్రమంగా మద్యం తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని శంషాబాద్ ఎక్సైజ్ పోలీసుల హెచ్చరిక
-
Sep 20, 2025 07:16 IST
రాయచోటిలో భారీ వర్షాలు.. ముగ్గురి మృతి..
రాయచోటిలో శుక్రవారం రాత్రి దంచికొట్టిన వర్షం..
డ్రైనేజీ కాలువలో పడి కొట్టుకుపోయిన తల్లీబిడ్డ..
ఎస్‌ఎన్ కాలనీ అంగన్‌వాడీ వెనుక వైపు డ్రైనేజీ కాలువ వరద నీటిలో కొట్టుకుపోయిన తల్లీబిడ్డ
తల్లీబిడ్డను కాపాడబోయి వరద నీటిలో కొట్టుకు పోయిన 25 సంవత్సరాల యువకుడు..
చివరకు గవర్నర్ ఫంక్షన్ హాల్ వద్ద మూడు మృతదేహాలు లభ్యం..
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.
-
Sep 20, 2025 07:12 IST
నేడు మాచర్ల లో సీఎం చంద్రబాబు పర్యటన..
చెరువు పరిసరాల్లో స్వచ్చతా కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
మాచర్ల నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబు.
సీఎం పర్యటనకు భారీ స్వాగతం ఏర్పాట్లు చేసిన ఎమ్మెల్యే జూలకంటి