-
-
Home » Mukhyaamshalu » ABN Andhra Jyothy Breaking today latest viral and trending news across GLOBE 4th oct 2025 kjr
-
BREAKING: జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్‌కల్యాణ్ భేటీ
ABN , First Publish Date - Oct 04 , 2025 | 06:29 AM
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..
Live News & Update
-
Oct 04, 2025 20:21 IST
హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు చార్జీలు పెంపు
అన్ని రకాల సిటీ బస్సుల్లో అదనపు చార్జీలు
మొదటి 3 స్టేజీల వరకు రూ.5, నాలుగో స్టేజీ నుంచి రూ.10 పెంపు
పెరిగిన బస్సు చార్జీలు ఈనెల 6 నుంచి అమలు
-
Oct 04, 2025 20:20 IST
అమరావతి: జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్‌కల్యాణ్ భేటీ
ముగ్గురు మినహా సమావేశానికి హాజరైన జనసేన ఎమ్మెల్యేలు
పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించిన పవన్
నామినేటెడ్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పవన్
క్షేత్ర స్థాయిలో కూటమి నేతలతో కలిసి పనిచేయాలని పవన్ ఆదేశం
అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని పవన్ సూచన
గంటకు పైగా కొనసాగుతున్న జనసేన ఎమ్మెల్యేల సమావేశం
-
Oct 04, 2025 17:30 IST
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో మాధవరెడ్డి పిటిషన్
తెలంగాణలో 50% మించి రిజర్వేషన్లు అమలుచేస్తున్నారని పిటిషన్
విచారణ సోమవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
-
Oct 04, 2025 17:16 IST
భారత్ టీ20 జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్,..
అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, నితీష్‌కుమార్‌రెడ్డి, శివమ్ దూబే, అక్షర్ పటేల్,..
జితేష్ శర్మ, సంజూ శామ్సన్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా,..
అర్ష్‌దీప్‌సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్
-
Oct 04, 2025 17:16 IST
భారత్ వన్డే జట్టు: శుభమన్ గిల్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్)
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్,..
ధ్రువ్ జురెల్, నితీష్‌కుమార్‌రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్,..
హర్షిత్ రాణా, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, యశస్వి జైస్వాల్
-
Oct 04, 2025 15:59 IST
విశాఖ: బెల్లం గణపతి ఆలయ సమీపంలో అపశృతి
దుర్గాదేవి మండపంలో గంజిపడి 16 మంది చిన్నారులకు గాయాలు
ఆరుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు, KGHకు తరలింపు
-
Oct 04, 2025 14:34 IST
రోహిత్ శర్మను తప్పించిన BCCI ..
ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్
రోహిత్ శర్మను తప్పించిన BCCI
ఆస్ట్రేలియాతో 3 వన్డేలు, 5 టీ20లు ఆడనున్న భారత్
ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన
-
Oct 04, 2025 13:43 IST
అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఘన విజయం
అహ్మదాబాద్ టెస్టులో భారత్ ఘన విజయం
వెస్టిండీస్‌పై ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలుపు
భారత్ 448/5 డిక్లేర్డ్, వెస్టిండీస్ 162 & 146 ఆలౌట్
సెంచరీలతో రాణించిన కేఎల్ రాహుల్, జురెల్, జడేజా
తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4, బుమ్రాకు 3 వికెట్లు
రెండో ఇన్నింగ్స్‌లో జడేజా 4, సిరాజ్‌కు 3 వికెట్లు
రెండు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్
-
Oct 04, 2025 13:38 IST
'ఆటో డ్రైవర్ల సేవ'లో పథకం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థికసాయం
ఏపీలో 2,90,669 మంది ఆటో, క్యాబ్, మ్యాక్సీ డ్రైవర్లకు లబ్ధి
డ్రైవర్ల ఖాతాల్లో రూ.436 కోట్లు జమ చేసిన ఏపీ ప్రభుత్వం
పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
-
Oct 04, 2025 11:29 IST
బీహార్‌లో ఎన్నికల సంఘం అధికారుల పర్యటన
బీహార్‌లో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు
నేడు, రేపు బీహార్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు
ఇప్పటికే బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు,ఉప ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
-
Oct 04, 2025 10:46 IST
ఆటో డ్రైవర్ సేవలో.. కార్యక్రమం ప్రారంభం..
వినుకొండలో ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి. ఆంజనేయులు.
చిలకలూరిపేటలో ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు.
పిడుగురాళ్లలో ప్రారంభించిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
నరసరావుపేటలో ప్రారంభించిన. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు
పెదకూరపాడులో ప్రారంభించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.
మోడీ , చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ఆటో డ్రైవర్ లు,
ఆటోలతో ర్యాలీలు చేపట్టిన ఆటో డ్రైవర్‌లు.
-
Oct 04, 2025 09:12 IST
శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నాం: మోదీ ట్వీట్
గాజాలో ట్రంప్ శాంతి ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంటూ ప్రధాని మోదీ ట్వీట్
ఇజ్రాయెల్ బందీల విడుదలకు హమాస్ అంగీకారం కీలక ముందడుగు
శాశ్వత శాంతి ప్రయత్నాలకు భారత్ మద్దతు: ప్రధాని మోదీ
మద్దతు పలికిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపిన డొనాల్డ్ ట్రంప్
-
Oct 04, 2025 08:16 IST
3వ రోజు ఘనంగా బ్రహ్మోత్సవాలు
ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో 3వ రోజు ఘనంగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలు
నేడు సరస్వతి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న చిన్న వెంకన్న
ఉదయం సూర్యప్రభ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం
రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం
-
Oct 04, 2025 08:06 IST
కొండాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు..
కొండాపూర్ లోని బిక్షపతి నగర్‌లో కూల్చివేతలు.
ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా సిబ్బంది.
భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు.
కూల్చివేతల వద్దకు మీడియాను అనుమతించని పోలీసులు..
రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను అడ్డుకుంటున్న పోలీసులు.