Chanakya Niti: మహిళలు వయస్సు, పురుషులు జీతాన్ని ఎందుకు గోప్యంగా ఉంచాలి? కారణమిదే!
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:34 PM
పురుషులను జీతం, స్త్రీలను వయస్సు ఎంత అని అడగకూడదని పెద్దలు చెప్పడం వినే ఉంటారు. ఈ విషయాన్ని ఎందుకు బహిరంగంగా వెల్లడించకూడదు అనే కారణాన్ని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో సవివరంగా తెలియజేశాడు.
అమ్మాయి వయస్సు, పురుషుడి జీతం అడగకూడదు, చెప్పకూడదు అనే సామెతను మీరు విని ఉండవచ్చు. అందుకే ఇప్పటికీ చాలామంది అమ్మాయిలు తమ వయస్సును, అబ్బాయిలు తమ జీతాన్ని బహిరంగంగా వెల్లడించరు. కారణం ఏంటనేది తెలియకపోయినా ఇప్పటికీ ఈ ఆచారం సమాజంలో నిగూఢంగా కొనసాగుతూనే ఉంది. ఇంతకీ, ఈ రెండు విషయాలు ఎందుకు బహిర్గతం చేయకూడదో చాణక్యుడు తన నీతిశాస్త్రంలో స్పష్టంగా ప్రస్తావించాడు. చాణక్యుడు మనిషి జీవితంలో పాటించాల్సిన అనేక చిట్కాలతో పాటు కొన్ని మార్గదర్శకాలను వెల్లడించాడని తెలిసిందే. అదేవిధంగా, పురుషుడు తన జీతం విషయం, స్త్రీ తన వయస్సు ఎందుకు దాచిపెట్టాలని అన్నాడో చూద్దాం.
మహిళల వయస్సు గురించి లేదా పురుషుడి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదని అంటారు. దీనికి కారణం స్త్రీ ఎప్పుడూ తనకోసం జీవించదు. అలాగే పురుషుడు కూడా ఎప్పుడూ తనకోసం సంపాదించడు అని చాణక్యుడు చెప్పాడు. ఇంకా అనేక విషయాలను ఇలా వివరించాడు.
మహిళలు తమ వయస్సును ఎందుకు చెప్పవద్దు
చాణక్య నీతి ప్రకారం, సమాజంలో గౌరవం, వ్యక్తిగత హోదాను కాపాడుకోవడం చాలా ముఖ్యం. మహిళలు తమ వయస్సును దాచడం ఉద్దేశ్యం వెనక కారణం భద్రత. తమ నిజమైన వయస్సును దాచడం ద్వారా మహిళలు సమాజంలో తమ విలువ, స్థానాన్ని కాపాడుకునేలా చూసుకోగలరని చాణక్యుడు అంటున్నాడు. అలాగే, మహిళలు తమ వయస్సుతో కాకుండా తమ కుటుంబ ఆనందంతో తమను తాము గుర్తించుకోవడానికి ఇష్టపడతారు. మొత్తంమీద, ఇది స్వీయ రక్షణ, సామాజికంగా మహిళలు ప్రశాంతంగా జీవించేందుకు అని చాణక్యుడు చెప్పాడు.
పురుషులు తమ జీతం ఎంతో ఎందుకు దాచాలి
సంపద, అధికారాన్ని వెల్లడించడం వల్ల తప్పనిసరిగా ప్రమాదం, పోటీ ఎదుర్కొవాల్సి వస్తుంది చాణక్యుడు నీతిశాస్త్రంలో చెప్పాడు. పురుషులు తమ నిజమైన ఆర్థిక స్థితిని తమకు తాముగా మాత్రమే వెల్లడిస్తారు. తద్వారా వారు సామాజికంగా లేదా ఆర్థికంగా నష్టపోరు. తమ జీతాల గురించి మాట్లాడితే తాము తక్కువ అని భావిస్తారు కాబట్టి వారు తమ నిజమైన ఆదాయాన్ని దాచిపెడతారని చాణక్య కూడా చెప్పాడు. అందువలన, ఇది సామాజిక ప్రతిష్ఠ, ఆర్థిక వ్యూహంలో భాగం.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
బంగారం, వెండి ఆభరణాలను పింక్ పేపర్లోనే ఎందుకు చుడతారో తెలుసా?
వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ మాత్రం ఉంచవద్దు.. ఎందుకంటే..
For More Devotional News