Share News

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా..

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:11 PM

ద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ను పరిశీలించారు.

MLA: ఎమ్మెల్యే ఆగ్రహం.. ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా..

- అధికారులపై ఎమ్మెల్యే కృష్ణారావు ఆగ్రహం

హైదరాబాద్: పేద ప్రజలు శుభకార్యాలు జరుపుకునే ఫంక్షన్‌ హాల్‌ నిర్వహణ ఇలాగేనా అంటూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(Kukatpally MLA Madhavaram Krishna Rao) అధికారులను ప్రశ్నించారు. మంగళవారం ఆయన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావుతో కలిసి కేపీహెచ్‌బీ నాలుగో ఫేజ్‌లోని మల్టీపర్పస్‌ ఫంక్షన్‌ హాల్‌ను పరిశీలించారు.


city7.2.jpg

ఫంక్షన్‌హాల్‌ చెత్తాచెదారంతో నిండి ఉండడం, ఆవరణలో మద్యం సీసాలు కన్పించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలు వెచ్చించి పేదలకు ఉపయోగపడేలా ఫంక్షన్‌ హాల్‌ నిర్మిస్తే నిర్వహణ చేయలేక ఇలా వదిలేస్తారా అని అధికారులను ప్రశ్నించారు. ‘నెల రోజులు సమయం ఇస్తున్నాను. మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. లేదంటే జీహెచ్‌ఎంసీ మూసాపేట కార్యాలయంలో పనులు జరగకుండా అడ్డుకుంటాన’ని ఎమ్మెల్యే అధికారులను హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అందుకే యూరియా ఆలస్యమైంది

మంత్రి ఉత్తమ్‌‌కు హరీష్ రావు సంచలన లేఖ

Read Latest Telangana News and National News

Updated Date - Aug 27 , 2025 | 01:11 PM