Share News

Spoiled Egg: కోడిగుడ్డు మంచిదా? పాడైందా? ఎలా తెలుసుకోవాలి.. ఇవిగో చిట్కాలు..

ABN , Publish Date - Nov 05 , 2025 | 04:05 PM

పాడైపోయిన కోడిగుడ్డు తింటే.. అనారోగ్యానికి గురవుతారు. అయితే కుళ్లిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

Spoiled Egg: కోడిగుడ్డు మంచిదా? పాడైందా? ఎలా తెలుసుకోవాలి.. ఇవిగో చిట్కాలు..

ప్రతీ రోజు కోడిగుడ్డు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. ఉడకబెట్టిన కోడిగుడ్డులోని పోషకాలు ఎదిగే పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. వీటి వల్ల వారిలో వ్యాధి నిరోధకత శక్తి సైతం పెరుగుతుంది. అయితే కోడిగుడ్లు కొనుగోలు చేసే సమయంలో ఆవి తాజావా? లేకుంటే కుళ్లిపోయినవా? అనే విషయం చాలా మంది అంతా పట్టించుకోరు. ఈ కోడిగుడ్లను ఉడకబెట్టి తినేస్తారు. పాడైపోయిన కోడిగుడ్డు తింటే.. ఆ తర్వాత అనారోగ్యానికి గురవుతారు. అయితే కుళ్లిన కోడిగుడ్డు తింటే ఆరోగ్యానికి చాలా ప్రమాదమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.


కుళ్లిపోయిన కోడిగుడ్లలోని బ్యాక్టీరియా శరీరంలోని కాలేయాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుందని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఈ గుడ్లు తినడం వల్ల లివర్ అల్సర్ అనే ప్రమాదకరమైన వ్యాధి వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీనిపై ఇప్పటికే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. ప్రతీ ఏడాది వేలాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారని స్పష్టం చేస్తోంది.


ఇక ఈ సమస్య పురుషుల్లోనే అధికంగా కనిపిస్తుందని ఎన్ఐహెచ్ వెల్లడించింది. సకాలంలో చికిత్స అందించకుంటే.. ఒకొక్కసారి మరణానికి చేరుకునే ప్రమాదం ఉందని వివరిస్తోంది. ఆ క్రమంలో కోడిగుడ్డు కొనుగోలు చేసే ముందే వాటిని తనిఖీ చేయాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం కొన్ని చిట్కాలను వారు చెబుతున్నారు.


Egg3.jpgగుడ్లను పరీక్షించే పద్దతులు..

  • ఒక గిన్నెతో నీళ్లు తీసుకోవాలి. అందులో గుడ్లు వేయండి. గుడ్డు నీటిలో మునిగితే... అది తాజాగా ఉందని అర్థం. అది నీటిలో తేలితే మాత్రం ఆ కోడిగుడ్డు పాడైపోయిందని భావించాలి.


  • గుడ్డు చెడిపోతే.. దాని నుంచి పుల్లని, కుళ్లిన వాసన వస్తుంది. అంటే సల్ఫర్ వాసన కలిగి ఉంటుంది. అయితే తాజా గుడ్డు ఎటువంటి వాసన ఉండదు. కాబట్టి గుడ్డు మంచిదా? కాదా? అని దానిని నుంచి వచ్చే వాసన ద్వారా సులభంగా చెప్పవచ్చు.


  • తాజా గుడ్డు ఉపరితలం శుభ్రంగా.. పగుళ్లు లేకుండా ఉండాలి. పెంకుపై పొడి లేదా బూజు కనిపించినా.. పెంకు జిగటగా ఉంటే గుడ్డు మంచిది కాదని గుర్తించాలి.


Egg-1.jpg

  • గుడ్డు పగలగొట్టడం ద్వారా అది తాజాదా? కాదా? అనేది తనిఖీ చేయవచ్చు. తాజా గుడ్డులోని తెల్లసొన భాగం స్పష్టంగా ఉంటుంది. గుడ్డులోని పచ్చసొన భాగం గుండ్రంగా ఉంటుంది. గుడ్డు రంగు మారితే లేదా పచ్చసొన భాగం రంగు మారినట్లు కనిపిస్తే.. ఆ గుడ్డు చెడిపోయినట్లు చెప్పవచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ వ్యాప్తంగా సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు

నో పోలీస్, నో పార్టీ.. ఓన్లీ పబ్లిక్.. ఎమ్మెల్యే ఒంటరి పర్యటన

For More LifeStyle News And Telugu News

Updated Date - Nov 05 , 2025 | 04:21 PM